తమన్నాకి అస్సలు ఇష్టం లేని సినిమా అదేనంట

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా సుదీర్ఘకాలం కొనసాగిన అందాల భామ తమన్నా. ఈ అమ్మడు శ్రీ మూవీతో మంచు మనోజ్ కి జోడీగా తెలుగులోకి హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. తరువాత హ్యాపీ డేస్ ఈ బ్యూటీకి బ్రేక్ ఇచ్చింది. రామ్ చరణ్ కి జోడీగా చేసిన రచ్చ సినిమా కమర్షియల్ గా తనని స్టార్ హీరోయిన్ గా మార్చేసింది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపొయింది.

ఇప్పటికి తమన్నా చేతిలో పెద్ద సినిమాలు ఉండటం విశేషం. రీసెంట్ గా లస్ట్ స్టోరీస్ 2తో ఈ బ్యూటీ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. సీనియర్ హీరోయిన్ కేటగిరీలో చేరిపోయిన తమన్నా రజినీకాంత్ కి జోడీగా జైలర్ లో నటించింది. అలాగే మెగాస్టార్ చిరంజీవితో భోళా శంకర్ సినిమాలో ఆడిపాడింది. ఈ రెండు సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి. ఈ మధ్య గ్లామర్ పరంగా కూడా తమన్నా కాస్తా స్పీడ్ పెంచింది.

ఇదిలా ఉంటే ఈ బ్యూటీ కెరియర్ ఆరంభంలో ఇళయదళపతి విజయ్ కి జోడీగా సుర అనే మూవీలో నటించింది. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించారు. మూవీలో సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అయ్యాయి. అయితే సినిమా మాత్రం విజయ్ కెరియర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారింది. తాజాగా తమన్నా ఈ మూవీపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన కెరియర్ లో ఇప్పటికి రిగ్రెట్ గా ఫీల్ అయ్యే మూవీ సుర అని చెప్పింది.

ఆ సినిమాలో చాలాసన్నివేశాలలో నా నటన నాకే నచ్చలేదని ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. సినిమా చేస్తున్నసమయంలో ఎందుకో నటన అంత బాగా అనిపించలేదని చెప్పింది. అయితే కొన్ని సినిమాలు చేస్తున్నసమయంలో మధ్యలో ఏదో తేడా కొడుతోంది. కానీ ఒప్పుకున్నాక కచ్చితంగా చేయాలి కాబట్టి బాధ్యతగా మూవీ కంప్లీట్ చేస్తాను. మన వృత్తిలో నిబద్ధత చాలా ముఖ్యం.

అది ఎప్పటికి కోల్పోకూడదు. సినిమా రంగం చాలా విలువైంది. ఎప్పటికి దానికి గౌరవం ఇవ్వాల్సిందే అని చెప్పుకొచ్చింది. సుర సినిమాపై తమన్నా ఇప్పుడు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. అయితే ఈ చిత్రంలో సాంగ్స్ మాత్రం తనకి చాలా ఇష్టమని, ఇప్పటికి ఎక్కడో ఓ చోట వినిపిస్తూ ఉంటాయని తమన్నా చెప్పడం విశేషం.