ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడానికి అదే ప్రధాన కారణం.. నరేష్ కామెంట్స్ వైరల్!

ఒకప్పుడు ఒక సినిమా విడుదల అయింది అంటే పెద్ద ఎత్తున ఆ సినిమా థియేటర్లు వంద రోజులు 200 రోజులు వేడుకలను కూడా జరుపుకునేది. అయితే ప్రస్తుత కాలంలో ఒక సినిమా వారం రోజులు పాటు థియేటర్లో ఉండడం ఎంతో కష్టతరం అవుతుంది. అయితే ఈ విధంగా ప్రేక్షకులు థియేటర్ కి వచ్చే సినిమా చూడకపోవడానికి గల కారణం ఓటీటీ అని భావిస్తున్నారు. కరోనా సమయంలో ఓటీటీలో సినిమాలను చూడటానికి అలవాటు పడిన ప్రేక్షకులు అనంతరం థియేటర్ కి రావడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదని అందరూ భావించారు.

అయితే ఇది పూర్తిగా ఆ వాస్తవమని, కంటెంట్ ఉంటే కచ్చితంగా ప్రతి ఒక్క ప్రేక్షకుడు థియేటర్ ఫీలింగ్ అనుభూతి చెందడానికి తప్పకుండా థియేటర్ కి వచ్చి సినిమాలు చూస్తారని తాజాగా విడుదలైన బింబిసారా, సీతారామం, కార్తికేయ 2 పంటి చిత్రాలు నిరూపించాయి. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సీనియర్ నటుడు నరేష్ ఈ విషయంపై మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడానికి గల కారణం కేవలం టికెట్లు రేట్లు మాత్రమే కాదు. టికెట్ల రేట్లు తగ్గించినప్పటికీ ప్రేక్షకులు థియేటర్ కి రాలేకపోతున్నారు అంటే అందుకు కారణం థియేటర్లో అమ్ముతున్నటువంటి పాప్ కార్న్ పెప్సీ ధరలు కూడా అమాంతం పెంచడమే. 30 రూపాయలకు దొరికే పెప్సీ పాప్ కార్న్ ఏకంగా 300 వరకు ఉండడంతో ఒక సామాన్యుడు వీటిని కొనలేని పరిస్థితి ఏర్పడింది.ఇలా థియేటర్లో వీటి ధరలు పెరగటం వల్ల కూడా చాలామంది థియేటర్ కు రాలేకపోతున్నారని, వాటి ధరలను కూడా నియంత్రించాలి అంటూ ఈ సందర్భంగా నరేష్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.