వైరల్ : దటీజ్ ప్రభాస్..తన ఫ్యాన్స్ ని ఖుషీ చేసిన రాజమౌళి రిప్లై.!

rajamouli reaction on prabhas adipurush

ఇప్పుడు ఇంటర్నేషనల్ వైడ్ తెలుగు సినిమా పాత్ర ఏ లెవెల్లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి ఈ తెలుగు సినిమా ప్రైడ్ అనే టాపిక్ వస్తే మాత్రం డెఫినెట్ గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరియు దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ల కోసమే మాట్లాడాలి. ఆ రేంజ్ లో ఇద్దరు కూడా తెలుగు సినిమా స్టాండర్డ్స్ ని సెట్ చేసి పెట్టారు.

అయితే తర్వాత ఇద్దరు కూడా తమ తమ సినిమాల్తో బిజీ అయ్యారు కానీ ఎక్కడో ప్రభాస్ ని పక్కన పెడుతున్నారు రాజమౌళి అన్నట్టుగా కూడా స్టార్ట్ అయ్యింది. కానీ ప్రభాస్ మాత్రం ఎప్పుడూ కూడా తన ప్రేమని అందరిపై సమానంగా చూపించాడు ఎక్కడా ఈగోకి కూడా వెళ్ళలేదు.

అయితే ఈగో అనేది అసలు తన స్వభావమే కాదు కానీ ఎక్కడో తన ఫ్యాన్స్ లో మాత్రం ప్రభాస్ నిష్కల్మషాన్ని ఎందుకు ఇతర దర్శకులు హీరోలు పక్కన పెడుతున్నారని బాధ ఉండేది. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా దర్శక ధీరుడు రాజమౌళి ఇచ్చిన ఓ రిప్లై మాత్రం ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేసేసింది.

రీసెంట్ గా రాజమౌళి ఇంటర్నేషనల్ సినిమా దగ్గర నామినేట్ అయ్యిన సంగతి తెలిసిందే. మరి దీనికి గాను ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రభాస్ శుభాకాంక్షలు తెలిపాడు. మరి దీనికి ఇప్పుడు జక్కన్న ఇచ్చిన రిప్లై నే మంచి వైరల్ గా మారింది.

ప్రభాస్ కి థాంక్స్ చెప్తూ నా అంతర్జాతీయ గుర్తింపు పై నాకే నమ్మకం లేని సమయం నువ్వు నన్ను నమ్మవు అని తెలిపారు. దీనితో ప్రభాస్ పెట్టుకున్న నమ్మకం నిజం అయ్యి కూర్చుంది. దీనితో ఈ రిప్లై మాత్రం ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కి చాలా ప్రశాంతతని ఇచ్చింది.