మెగాస్టార్ పై యువ హీరో ఆశలు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వస్తోన్న చిత్రం భోళా శంకర్. ఈ మూవీ ఆగష్టు 11న థియేటర్స్ లోకి వస్తోంది. వాల్తేర్ వీరయ్య లాంటి సూపర్ సక్సెస్ తర్వాత మెగాస్టార్ నుంచి వస్తోన్న సినిమా ఇది. తమిళ్ హిట్ మూవీ వేదాళం రీమేక్ గా భోళా శంకర్ బిగ్ స్క్రీన్ పై ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చిన ట్రైలర్ మెగా ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది.

చిత్రంలో మెగాస్టార్ చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తోంది. హీరోయిన్ గా తమన్నా భాటియా కనిపించబోతోంది. ఇదిలా ఉంటే మూవీలో మరో కీలక పాత్రలో అక్కినేని హీరో సుశాంత్ నటిస్తున్నాడు. హీరోగా ఆశించిన స్థాయిలో సుశాంత్ సక్సెస్ కాలేదని చెప్పాలి. కాళిదాసు సినిమాతో సుశాంత్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. ఆ మూవీలో తమన్నా సుశాంత్ కి జోడీగా నటించింది. ఆమె స్టార్ హీరోయిన్ అయిపోయి ప్రస్తుతం మెగాస్టార్ కి జోడీగా భోళా శంకర్ లో నటిస్తోంది.

అయితే సుశాంత్ కెరియర్ మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదని చెప్పాలి. అతని ఖాతాలో చెప్పుకోదగ్గ హిట్ అంటే చిలసౌ మూవీ మాత్రమే. అయితే హీరోగా సక్సెస్ లు రాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి అల వైకుంఠపురములో మూవీలో నటించాడు. ఆ సినిమా హిట్ అయిన సుశాంత్ కి కెరియర్ పరంగా ఎలాంటి ప్లస్ కాలేదు. ఈ ఏడాది రావణాసుర మూవీలో సెకండ్ హీరోగా నటించాడు.

ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు మెగాస్టార్ భోళా శంకర్ సినిమాలో కీర్తి సురేష్ కి జోడీగా కనిపించబోతున్నాడు. ఈ సినిమాపై సుశాంత్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. కచ్చితంగా భోళా శంకర్ సక్సెస్ ఇస్తుందని అనుకుంటున్నాడు. మరి మెగాస్టార్ ఇమేజ్ కారణంగా అయిన భోళా శంకర్ హిట్ అయ్యి సుశాంత్ కి యాక్టర్ గా గుర్తుండిపోయే సినిమా అవుతుందేమో చూడాలి.

ఈ సినిమా సక్సెస్ అయితే సుశాంత్ లీడ్ రోల్స్ కోసం మళ్ళీ నిలబడే ఛాన్స్ దొరుకుతుంది. లేదంటే ఆశించిన స్థాయిలో ఫేమ్, సక్సెస్ సాధించడానికి మరికొంత సమయం వేచి చూడాల్సిందే. అయితే మెగాస్టార్ సినిమా అంటే ఫ్యాన్స్ అందరూ మెగా మానియాలో ఉంటారు. సుశాంత్ ని ఎంత వరకు పట్టించుకుంటారు అనేది కూడా ఇప్పుడు డౌట్ గానే ఉంది.