Radhe Shyam:రాధేశ్యామ్ నెగిటివ్ కౌంటర్ల కి అదిరిపోయే పంచ్ ఇచ్చిన తమన్..!

Radhe Shyam:పాన్ ఇండియా మూవీ గా అభిమానుల ముందుకు రాధేశ్యామ్ శుక్రవారం వచ్చేసింది.ఈ సినిమా కు రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించగా, టి -సిరీస్, యు వి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో ప్రభాస్ పక్కన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.ఈ సినిమా లో కృష్ణం రాజు, భాగ్యశ్రీ లు కీలక పాత్రల్లో నటించడం జరిగింది.సాహో చిత్రం తర్వాత భారీ అంచనాలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సినిమా విడుదలైన మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. రివ్యూలు కూడా పాజిటివ్ గానే వస్తున్నాయి. అయితే అక్కడక్కడా సినిమా ఆశించిన స్థాయిలో లేదని ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది.సోషల్‌ మీడియాలో వేదికగా రాధేశ్యామ్‌పై పలు రకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. సినిమా కొంచెం స్లో గా ఉందన్న నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. రాధే శ్యామ్ సినిమా గురించి వస్తున్న ఈ నెగిటివ్ కామెంట్ పై ప్రముఖ సంగీత దర్శకుడు ఆయన తమ స్పందించారు. తనదైన శైలిలో కౌంటర్ కూడా ఇచ్చారు.

నెగిటివ్ కామెంట్ పై స్పందిస్తూ కామెంట్ చేసే వారికి పనిష్మెంట్ ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ చేశారు.వెంకీ సినిమాలో బ్రహ్మానందం సన్నివేశాన్ని మీమ్‌గా క్రియేట్‌ చేసిన ఫోటోను ట్విట్టర్‌ వేదికగా పోస్ట్‌ చేశారు థమన్‌. ఇందులో సినిమా ఎలా ఉందనగా.. బాగా స్లోగా ఉందని సమాధానం చెబుతోంది. దీంతో అవతల బ్రహ్మానందం రిప్లై ఇస్తూ.. ‘నేను అడిగింది బాగుందా? బాలేదా? అని!, లవ్‌ స్టోరీ స్లోగా కాకుండా ఫస్ట్‌ హాఫ్‌లో ఫస్ట్‌ నైట్‌, సెకండాఫ్‌లో సెకండ్‌ సెటప్‌ పెట్టాలా ఏంటి?’ అని ఉన్న సదరు మీమ్‌ను పోస్ట్‌ చేసిన థమన్‌.. ‘స్లో అంటే.. నువ్వు పరిగెత్తాల్సింది. మీమ్‌ అదిరింది’ అంటూ పంచ్‌ ఇచ్చారు.  దీంతోపాటు బ్లాక్బస్టర్ రాధేశ్యామ్ అంటూ హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు. ప్రస్తుతం వీటి నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది.