విజయ్ దళపతి లాస్ట్ సినిమా రీమేక్ కాదా?

తమిళ సినిమా బిగ్గెస్ట్ స్టార్ హీరోస్ లో మాసివ్ మార్కెట్ ఉన్నటువంటి విజయ్ దళపతి కూడా ఒకడు. కాగా తన కెరీర్ ఇప్పుడు మంచి పీక్స్ లోకి వెళ్లిన సమయంలో ఊహించని విధంగా పొలిటికల్ ఎంట్రీని కన్ఫర్మ్ చేస్తూ తాను సినిమాలు వదిలేస్తున్నట్టుగా కూడా తెలిపాడు. దీనితో ఫ్యాన్స్ కి ఒక్కసారిగా షాక్ తగిలినట్టు అయ్యింది.

ఇప్పుడు చేస్తున్న సినిమా తర్వాత మరొక్క సినిమా చేసి ఇక పూర్తిగా రాజకీయాల్లో మాత్రమే ఉంటానని చెప్పేసాడు. దీనితో ఇపుడు విజయ్ చేయబోయే చివరి సినిమా ఏంటి అనేది అందరిలో సస్పెన్స్ గా మారింది. కాగా ఈ చిత్రం ఒక రీమేక్ అని అది కూడా బాలయ్య నటించిన రీసెంట్ సీన్న్మ భగవంత్ కేసరి కి రీమేక్ అంటూ కొన్ని స్టార్ట్ అయ్యాయి.

అంతే కాకుండా తమిళ యంగ్ దర్శకుడు హెచ్ వినోద్(ఖాకీ, వలిమై ఫేమ్) దర్శకుడు దీనిని చేస్తాడని వార్తలు వచ్చాయి. కానీ మరోపక్క విజయ్ 69వ సినిమా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ కాంబినేషన్ లో అంటూ కూడా వార్తలు ఉన్నాయి.

ఇవి చాలామంటూ ఆర్ ఆర్ ఆర్ నిర్మాణ సంస్థ డీవీవీ వాళ్ళు విజయ్ తదుపరి సినిమాని చేస్తున్నారని దానికే “హంగ్రీ చీతా” అనే టైటిల్ పెట్టుకున్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు విజయ్ లాస్ట్ సినిమా విషయంలో మాత్రం గట్టిగానే ఆసక్తి నెలకొంది. మరి దీనిపై ఒక అధికారిక క్లారిటీ వస్తే కానీ ఎవరికీ ఏమి అర్ధం కాదు.