Viral News: బన్నీ హీరోగా గతేడాది విడుదలైన ‘పుష్ప’ ఏ లెవల్‌లో సంచలన విజయాన్ని నమోదు చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ రోజులో ఎక్కడో ఓ చోట ఆ సినిమాలోని డైలాగులు, పాటలు వినిపిస్తూనే ఉంటాయి. తెలుగు రాష్ట్రాలలో నే కాదు, ఓవర్సీస్ లోను ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టి భారీ సక్సెస్‌ను సొంతం చేసుకుంది. ఇక హిందీ వెర్షన్ 100 కోట్లకి పైగా రాబట్టడం విశేషం. ఈ సినిమా వచ్చి దాదాపు 4 నెలలు అవుతున్నా పుష్ప ట్రెండ్ ఇంకా కొనసాగుతోంది.
మామూలుగా పరీక్షల్లో సమాధానం రాకపోతే ఏం చేస్తే కొందరైతే తెల్ల కాగితం ఇచ్చేసి వెళ్తారు. కానీ మరికొందరు మాత్రం ఉన్న ప్రశ్న పత్రాన్నే తిరగరాసి తమ టాలెంట్‌ను ప్రదర్శిస్తారు. ఇంకొందరైతే సినిమా పాటలు లేదా స్టోరీతో నింపేస్తారు. ఆ నేపథ్యంలోనే తాజాగా ఓ విద్యార్థి చేసిన ఘటనను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.. దీనికి కారణం పుష్ప సినిమా అని టాక్.
answer sheet me v pushpa raj🤣🤣 pic.twitter.com/3RVwDwB4to
— Manoj Sarkar (@manojsarkarus) April 4, 2022
ఇక వివరాల్లోకి వెళితే పశ్చిమ బెంగాల్‌లోని ఓ విద్యార్థి పరీక్షల్లో ఆన్సర్‌కు బదులుగా పుష్ప సినిమాలోని డైలాగులు రాసి, ఆన్సర్ షీట్‌ను నింపేశాడు. పదో తరగతి చదువుతున్న ఈ కుర్రాడు తన సమాధాన పత్రంలో పుష్ప..పుష్పరాజ్.. అపున్ లిఖేగా నహీ (రాసేదే లేదు)” అని రాసి అందర్నీ అవాక్కయ్యేలా చేశాడు. ప్రస్తుతం ఈ స్టూడెంట్ రాసిన ఆన్సర్ షీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన అభిమానులు బన్నీ ఫ్యాన్స్.. తగ్గేదేలే అంటూ కాలర్ ఎగరవేస్తుండగా, మరికొందరేమో పరీక్షల్లో ఇలా డైలాగులు రాయడమేంటని విమర్శిస్తున్నారు.