‘పుష్ప’కి టెన్షనా.? సుకుమార్ వుండగా అల్లు అర్జున్‌కెందుకు అంత టెన్షన్.?

ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా.. అల్లు అర్జున్‌ని పాన్ ఇండియా స్టార్‌ని చేసేసింది. అదే, ‘పుష్ప ది రైజ్’.! ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్, ‘పుష్ప ది రూల్’తో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాడు అల్లు అర్జున్.

వాస్తవానికి, ‘పుష్ప ది రైజ్’ విడుదలైన కొద్ది నెలల్లోనే, ‘పుష్ప ది రూల్’ కూడా విడుదలవుతుందని అప్పట్లో ప్రకటించినా, ఆ తర్వాత చాలా చాలా గ్యాప్ పట్టేసింది, రెండో పార్ట్ సెట్స్ మీదకు వెళ్ళడానికే.

ఆలస్యం అవడమనేది, సినిమా క్వాలిటీని పెంచడం కోసమే.. అని చిత్ర యూనిట్ చెప్పుకుంది. నిజమే, ‘పుష్ప ది రైజ్’ క్వాలిటీ విషయంలో చాలా విమర్శలొచ్చాయి. అయినా, సినిమా అనూహ్యమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది.

ఈ నేపథ్యంలో, ‘పుష్ప ది రూల్’ విషయమై అంచనాలు మరింతగా పెరిగిపోయాయ్. దాంతో, గ్రాఫిక్స్ సహా మేకింగ్‌లో ఎక్కడా లోటుపాట్లు లేకుండా చేసుకోవాలనుకుంది చిత్ర యూనిట్. ఎంత టైమ్ తీసుకున్నా, బడ్జెట్ పెరిగిపోతోంటో, టెన్షన్ కూడా పెరిగిపోతుంది కదా.!

మార్కెటింగ్ విషయంలో ‘పుష్ప ది రూల్’ అప్పుడే కిందా మీదా పడుతోందన్నది ఇన్‌సైడ్ సోర్సెస్ సమాచారం. సుకుమార్ – అల్లు అర్జున్ అలాగే నిర్మాణ సంస్థ, పూర్తిగా మార్కెటింగ్ మీదనే ఫోకస్ పెట్టాల్సి వస్తోంది. అప్పుడే రేట్లను భారీగా చెప్పేస్తున్నారనీ, బయ్యర్స్ పెదవి విప్పుతున్నారనీ.. ప్రచారం తెరపైకి రావడం చిత్ర యూనిట్‌ని కొంత ఇబ్బందికి గురిచేస్తోందిట.