టాలీవుడ్‌లో ఓ స్టార్ హీరో సన్నీలియోన్‌పై మనసు పారేసుకున్నాడట. బ్యాక్ టు బ్యాక్ ఈ మధ్య ప్లాపులిచ్చిన హీరో అతను. వరుసగా సినిమాలు చేస్తున్నాడు కానీ, కలిసి రావడం లేదు.
మరీ కుర్ర హీరోయిన్లతో రొమాన్స్ చేస్తూ చిరాకు పుట్టిస్తున్నాడన్న ఆరోపణలు కూడా వున్నాయ్. ఏదో అలా హీరోయిన్ ఫ్యాక్టర్స్‌పై సినిమాలు లాగించేస్తున్నాడు కానీ, దారుణంగా విమర్శల పాలైపోతున్నాడా స్టార్ హీరో.
అందుకే సన్నీలియోన్‌తో ఈ సారి సరికొత్తగా ట్రై చేయబోతున్నాడట. సన్నీలియోన్‌కి టాలీవుడ్‌లో ఎప్పుడూ క్రేజే. అయితే, ఆమె నటించినంత మాత్రానా ఆ సినిమాలు సక్సెస్ అయ్యాయా.? లేదా.? అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందరికీ తెలిసిందే.
కానీ, సర్లే ఓ ట్రై చేస్తే పోలా.! అనుకుంటున్నాడో ఏమో.. ఈ టాలీవుడ్ హీరో. తన కొత్త సినిమాలో సన్నీలియోన్ కోసం ఓ సాంగ్, కొన్ని నిమిషాలుండే సీన్లు ప్లాన్ చేస్తున్నాడట. చూడాలి మరి, ఏం జరుగుతుందో.!