తెలుగమ్మాయి.. లెస్బియన్ వేషాలు

anjali 1

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ఎంతో హోమ్లీగా కనిపించిన తెలుగమ్మాయి అంజలి. ఈమె మన ఈస్ట్ గోదావరి అమ్మాయే. ప్రస్తుతం కోలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని బిజీగా అవకాశాలు అందుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే ఆమెను ఇటీవల చూడని తెలుగు ఆడియెన్స్ ఇప్పుడూ చుస్తే మాత్రం ఇక్కసారిగా షాక్ అవ్వకుండా ఉండలేరు.

anjali

చాలా వరకు సింపుల్ రోల్స్ లోనే కనిపించే అంజలి ఇటీవల నెట్ ఫ్లిక్స్ కోసం చేసిన ఒక వెబ్ సినిమాలో మాత్రం ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. అసలు ఆమె అంజలి అంటే ఎవరు కూడా నమ్మరేమో. ఏకంగా లో దుస్తుల్లో కనిపించి అలాగే మరొక హీరోయిన్ కు లిప్ లాక్ కూడా ఇచ్చేసింది. అంటే లెస్బియన్ గా అన్నమాట. నెట్‍ఫ్లిక్స్ ‘పావ కథైగళ్‍’ సినిమాలో నటించిన అంజలి ఒక సీన్ లో బ్రా మాత్రమే వేసుకొని షాక్ ఇచ్చింది.

ఇక ఆమె క్లీవేజ్‍ షో ఇప్పుడు ఇంటర్నెట్‍ వరల్డ్ లో తెగ వైరల్ అవుతోంది. ఇక మరో నటి కల్కి కొచ్లీన్‍తో లిప్‍ లాక్‍ సీన్ లో కూడా నటించింది. తెలుగు హీరోయిన్స్ గ్లామర్ విషయంలో బెట్టు చేస్తారని అనుకుంటున్నా తరుణంలో అమ్మడు ఏకంగా లెస్బియన్ పాత్రలో నటించి బాలీవుడ్ భామలకు తాము ఏ మాత్రం తక్కువ కాదని నిరూపించింది. మరి ఆ పాత్ర ద్వారా అమ్మడు భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి.