తెలుగు బిగ్ బాస్ ఫైనల్స్ కి రికార్డ్ బ్రేకింగ్ రేటింగ్స్.. చరిత్ర తిరగరాసిన సీజన్ 4 !

no elimination only invisible process in hindi bigg boss 14

బిగ్ బాస్ .. బిగెస్ట్ రియాలిటీ షో ఇన్ ది వరల్డ్. అసలు ఈ తరహా షోలని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారా అంటూ అనుమానం తో మొదలైన ఈ షో రికార్డ్ స్థాయి రేటింగ్స్ తో రియాలిటీ షోలలో కింగ్ గా నిలిచింది. ఇప్పటికే తెలుగులో నాలుగు సీజన్లు ముగిసిపోయాయి. ఈ మద్యే బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలే చాలా గ్రాండ్ గా ముగిసింది.

 

ఇదిలా ఉంటే మొదటి సీజన్ కి ఎన్టీఆర్ హోస్ట్ గా చేయగా, రెండో సీజన్ కి నాని హోస్ట్ చేసాడు , ఇక సీజన్ 3 , సీజన్ 4 అక్కినేని నాగార్జున హోస్ట్ గా బరిలోకి దిగి షో ను మరో లెవెల్ కి తీసుకుపోయాడు. బిగ్ బాస్ షో జరిగినన్ని రోజులు రేటింగ్ ఒకలా ఉంటే , షో ఓపెనింగ్ రోజు , ఫైనల్ రోజు రేటింగ్ అదిరిపోతోంది. సీజన్ విన్నర్ ఎవరు అవుతారో అంటూ ప్రేక్షకుల్లో సస్పెన్స్ కొనసాగిస్తూ షో పై ఆసక్తిని పెంచేస్తారు.

ఈ నేపథ్యంలో తెలుగు బిగ్ బాస్ గ్రాండ్ ఫైనల్స్ కి వచ్చిన రేటింగ్స్ ను ఒకసారి చూద్దాం.. ఎన్టీఆర్ హోస్ట్ గా మొట్టమొదటిసారి తెలుగు లో ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 కి గ్రాండ్ ఫినాలే రోజు 14.13 రేటింగ్ వచ్చింది. ఆ తర్వాత నాని సారథ్యంలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 గ్రాండ్ ఫినాలే కి 15.05 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఇక నాగార్జున హోస్ట్ గా ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 కి 18.29 టిఆర్పి రేటింగ్ రాగా , తాజాగా నాగార్జునసారథ్యంలోనే ముగిసిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 కి 19. 51 టిఆర్పి రేటింగ్ వచ్చింది.