తెలుగు ఆడియెన్స్ పవర్..”జవాన్” కి అదిరే ఓపెనింగ్స్.!

ఇతర ఇండస్ట్రీ హీరోస్ లో తెలుగు మార్కెట్ కి గాని తెలుగు ఆడియెన్స్ అన్నా కానీ ప్రత్యేక అభిమానం ఎప్పుడూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అయితే ఆశ్చర్యకరంగా తెలుగులో కొందరు ఇతర ఇండస్ట్రీ స్టార్ హీరోలు తమ సినిమాలకి ఫంక్షన్స్ లు చేసినా చేయకపోయినా తెలుగు ఆడియెన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ మామూలుగా ఉండదు.

అలా తెలుగులో ఎలాంటి ప్రమోషన్స్ కూడా లేకుండా భారీ ఓపెనింగ్స్ ని అందుకున్న లేటెస్ట్ డబ్బింగ్ సినిమానే “జవాన్”. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ఈ చిత్రం తెలుగులో అసలు ప్రమోషన్స్ చేసుకోలేదు. అయినా కూడా హైప్ నెక్స్ట్ లెవెల్లో నెలకొంది.

ఇలా ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో అయితే భారీ ఓపెనింగ్స్ అందుకున్న బాలీవుడ్ చిత్రంగా ఇప్పుడు ఇది నిలిచినట్టుగా సినీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తంగా అయితే ఈ చిత్రం ఒక్క తెలుగు నుంచే ఏకంగా 9.5 కోట్ల మేర గ్రాస్ ని రాబట్టినట్టుగా చెప్తున్నారు. దీనితో ఏ బాలీవుడ్ సినిమాకి అయితే ఇంత రేంజ్ ఓపెనింగ్స్ ఇప్పటివరకు రాలేదు అని అంటున్నారు.

అలాగే తమిళ్ లో అయితే ఈ సినిమాకి ఏకంగా భారీ ఈవెంట్ చేశారు. షారుఖ్ వెళ్ళాడు అట్లీ విజయ్ సేతుపతి, నయన్ ఇలా అందరు ఉన్నప్పటికీ కూడా తెలుగు కన్నా కేవలం 1, 2 కోట్ల గ్యాప్ మాత్రమే ఎక్కువ వచ్చాయి. దీనిబట్టి మన తెలుగు ఆడియెన్స్ పవర్ ఎలాంటిదో మనం అర్ధం చేసుకోవాలి. కాగా ఈ చిత్రం అయితే నెక్స్ట్ డే నుంచి కూడా సాలిడ్ హౌస్ ఫుల్స్ చూపిస్తుంది. ఇక వీకెండ్ వసూళ్లు ఎలా ఉంటాయో చూడాల్సిందే.