కౌన్ బనేగా కరోడ్ పతి షోలో తెలంగాణ టీచర్.. అమితాబ్ ఫిదా

telangana teacher sabitha reddy in kaun banega crorepati 2020

లక్షల్లో ఒక్కరికి మాత్రమే ఆ అవకాశం దక్కుతుంది. అదే కౌన్ బనేగా కరోడ్ పతి షో. హిందీలో ప్రసారమయ్యే ఈ షో ఇప్పటికి 11 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్నదంటే దీనికి ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. ఈ షోలో పార్టిసిపేట్ చేయాలని లక్షల మంది ఎదురు చూస్తుంటారు. ఈ షోలో డబ్బులు సంపాదించకున్నా.. అమితాబ్ ముందు హాట్ సీట్ లో కూర్చుంటే చాలు.. అని అనుకునే వాళ్లు బోలెడు. అది ఆ షోకు ఉన్న పాపులారిటీ.

telangana teacher sabitha reddy in kaun banega crorepati 2020
telangana teacher sabitha reddy in kaun banega crorepati 2020

ప్రస్తుతం 12వ సీజన్ ప్రారంభం అయింది. ఇటీవలే ఈ సీజన్ ప్రారంభం అయింది. మొదటి నుంచి ఈ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. నిజానికి ఈ షో అంత సక్సెస్ కావడానికి ప్రధాన కారణం అమితాబే.

ఇప్పుడు ఈ షో గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవడానికి ఓ కారణం ఉంది. ఈ షోలో తెలంగాణకు చెందిన మహిళ ఒకరు పాల్గొన్నారు. ఆమె ఎవరో కాదు.. హైదరాబాద్ లోని అల్వాల్ కు చెందిన సబితా రెడ్డి. ఆమె షోకు రావడమే కాదు.. అమితాబ్ ముందు హాట్ సీట్ లో కూర్చునే అవకాశాన్ని కూడా దక్కించుకున్నారు.

telangana teacher sabitha reddy in kaun banega crorepati 2020
telangana teacher sabitha reddy in kaun banega crorepati 2020

అమితాబ్ ముందు హాట్ సీట్ లో కూర్చున్నాక.. ఆమె లైఫ్ జర్నీకి సంబంధించిన వీడియోను అక్కడ ప్రదర్శించారు. ఆమె లైఫ్ జర్నీ చూసిన అమితాబ్ ఫిదా అయిపోయారు. ఆమె స్ఫూర్తివంతమైన జీవితాన్ని చూసి ఆయన చాలా భావోద్వేగానికి గురయ్యారు.

తన పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే భర్త చనిపోయారని.. పిల్లలను పెద్ద చేసి చదివించడం కోసం ఎంతో కష్టపడ్డానని సబిత చెప్పడం.. అమితాబ్ ను కదిలించింది. నేను పిల్లలకు ఆస్తులు, అంతస్తులు ఇవ్వలేను కానీ.. మంచి చదువును అందిస్తున్నా.. అంటూ సబిత తన లైఫ్ జర్నీలో పేర్కొన్నారు.