బాలీవుడ్ మెగాస్టార్ సినిమాలో ర‌ష్మిక‌.. వ‌రుస బాలీవుడ్ ఆఫ‌ర్స్‌తో ఫుల్ బిజీ!

క‌న్నడ చిత్రం కిర్రిక్ పార్టీ సినిమాతో వెండితెర ఆరంగేట్రం చేసిన అందాల భామ ర‌ష్మిక మందాన‌. చూడ‌చ‌క్క‌ని అందం, ఆకట్టుకునే అభిన‌యం ఈమె సొంతం. ఛలో అనే సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన ఈ ముద్దుగుమ్మ గీతా గోవిందం చిత్రంతో మ‌రింత ద‌గ్గ‌రైంది. ఇక ఈ ఏడాది వ‌చ్చిన స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంతో ప్రేక్ష‌కుల‌కు పసందైన వినోదం అందించింది. ప్ర‌స్తుతం అల్లు అర్జున్ స‌ర‌స‌న పుష్ప అనే సినిమా చేస్తుండ‌గా, ఈ సినిమా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుంది. నేటి నుండి ఈ చిత్ర షూటింగ్ నెల రోజుల పాటు మారెడుమిల్లి అట‌వీ ప్రాంతంలో జ‌ర‌గ‌నుంది.

కెరీర్‌లో అంచెలంచ‌లుగా ఎదుగుతూ వ‌స్తున్న ర‌ష్మిక త‌మిళం, హిందీ భాష‌ల‌లోను వ‌రుస ఆఫ‌ర్స్ అందుకుంటుంది. ఇటీవ‌ల యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా తెరకెక్క‌నున్న మిష‌న్ మ‌జ్ను చిత్రంలో ఫీమేల్ లీడ్ పోషిస్తున్న‌ట్టు ఇటీవ‌ల అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. బాలీవుడ్ న‌టుడు సిద్ధార్థ్ మ‌ల్హోత్రా చిత్రంలో ప్ర‌ధాన పాత్ర పోషిస్తుండ‌గా, ఈ ఈమూవీ పాకిస్థాన్ లో రా (భార‌త సీక్రెట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ) చేప‌ట్టిన అతిపెద్ద కోవ‌ర్ట్ ఆప‌రేష‌న్ లోని వాస్త‌వ సంఘ‌ట‌న‌ల ఆధారంగా తెర‌కెక్కుతుంది. ‌మ‌రి కొద్ది రోజుల‌లో సెట్స్ పైకి వెళ్ల‌నున్న ఈ సినిమా ర‌ష్మిక‌కు మంచి పేరు తెస్తుంద‌ని మేక‌ర్స్ అంటున్నారు.

తాజాగా ర‌ష్మిక మ‌రో బాలీవుడ్ ఆఫ‌ర్ కొట్టేసింది. మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సినిమాలో ఓ హీరోయిన్‌గా నటించే అవకాశాన్ని సొంతం చేసుకుందని తెలుస్తోంది.వికాస్ బాల్ తెర‌కెక్కించ‌నున్న సినిమాకు ర‌ష్మిక సైన్ చేసింద‌ని త్వ‌ర‌లోనే దీనిపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుంది. . ‘డెడ్లీ’ అనే పేరుతో రూపొంద‌నున్న ఈ సినిమాలో తండ్రీ కూతుళ్ళ మధ్య అనుబంధాన్ని భావోద్వేగాలు జోడించి చూపించనున్నారట. ఇందులో అమితాబ్ తండ్రిగా, ర‌ష్మిక కూతురిగా న‌టించనుంద‌ని టాక్ . కాగా, ర‌ష్మిక తెలుగులో శర్వానంద్ హీరోగా రూపొందబోతున్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమా లోను క‌థానాయిక‌గా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.