టీజర్ టాక్ : ఒక్క డైలాగ్ కూడా లేకుండా చించేసిన విక్రమ్ “తంగలాన్”

ఇప్పుడు తమిళ సినిమా అయితే ఓ రేంజ్ లో రైజ్ అవుతుండగా వరుసగా రెండు 500 కోట్ల గ్రాసింగ్ చిత్రాలు కొట్టిన తమిళ ఇండస్ట్రీ రానున్న రోజుల్లో మరిన్ని భారీ చిత్రాలు చేస్తుండగా వాటిలో విలక్షణ హీరో చియాన్ విక్రమ్ హీరోగా మాళవిక మోహనన్ హీరోయిన్ గా దర్శకుడు పా రంజిత్ తెరకెక్కించిన క్రేజీ చిత్రం “తంగలాన్” కూడా ఒకటి.

కాగా ఈ చిత్రం అనౌన్స్ చేసి విక్రమ్ కొత్త లుక్ చూసి చాలా మంది తక్కువ అంచనా వేసి ఉండొచ్చు కానీ ఇప్పుడు వదిలిన టీజర్ చూస్తే మాత్రం నూటికి నూరు పాళ్ళు తమ అభిప్రాయం మార్చుకుంటారని చెప్పడంలో సందేహం లేదు. ఆ రేంజ్ లో దర్శకుడు పా రంజిత్ తన వెర్సటాలిటీ చూపించాడు.

ఇప్పటికే కబాలి, సర్పట్ట అలాగే కాలా లాంటి చిత్రాలతో చాలా నాచురల్ టేకింగ్ ని చూపించిన తాను వాటి అన్నిటికి ఎన్నో రేట్లు పొటెన్షియల్ తో సినిమా చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ టీజర్. ఒక్క డైలాగ్ కూడా లేకుండా కేవలం ఒక ఇంటెన్స్ బి జి ఎం కంప్లీట్ గా విక్రమ్ నట విశ్వరూపం తో ఈ టీజర్ చింపేసేలా ఉంది. అని చెప్పాలి.

సినిమా బ్యాక్ డ్రాప్ అంతా చాలా కలం వెనుక ఒక గిరిజన తెగ వారికీ ఎదురయ్యే సవాళ్లు లాంటివి కనిపిస్తున్నాయి. అలాగే మధ్యలో పాముతో ఒక షాట్ అయితే అసలు క్రేజీ అని చెప్పాలి. విక్రమ్ నటన ఈ నడవడిక నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇక ఆ ఏక్షన్ సీక్వెన్స్ లు ఈ మధ్య కాలంలో ఏ సినిమా కూడా ఈ రేంజ్ బ్రుటల్ గా లేదు అలా టీజర్ అయితే కంప్లీట్ ఊహించని లెవెల్లో ఉంది. మరి వచ్చే ఏడాది జనవరి 26న ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతుంది. 
Thangalaan - Official Teaser  | Chiyaan Vikram | K E Gnanavelraja | Pa Ranjith | G V Prakash Kumar