తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఇద్దరు కలిసి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమాలో వీరిద్దరిని ఎంతో మంచి స్నేహితులుగా జక్కన్న చూపించారు. అయితే నిజ జీవితంలో మాత్రం వీరిద్దరూ అంతకుమించి మంచి స్నేహితులని ఇద్దరి మధ్య ఎంతో మంచి బాండింగ్ ఉందని ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో వెల్లడించారు.
ఇకపోతే తాజాగా వీరిద్దరి మధ్య జరిగిన ఓ సంఘటన గురించి తెలిస్తే మాత్రం రాంచరణ్ ఎన్టీఆర్ మధ్య ఎలాంటి స్నేహబంధం ఉందో అర్థమవుతుంది.రాజమౌళి సినిమాలో నటించిన అనంతరం పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈ హీరోలు తమ తదుపరి సినిమాల విషయంలో కూడా అంతే జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ కొరటాల శివ ప్రశాంత్ నీల్ సినిమాలకు కమిట్ అయినప్పటికీ ఇంకా ఈ సినిమాలు షూటింగ్ ప్రారంభం చేసుకోలేదు. ఇక ఇది మాత్రమే కాకుండా ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సైతం ఎన్టీఆర్ కు ఓ కథ వినిపించారు.
ఈ కథ ఎంతో అద్భుతంగా ఉన్నప్పటికీ తనకన్నా ఈ కథ రామ్ చరణ్ కు బాగా సూట్ అవుతుందని భావించారట. ఇక రామ్ చరణ్ సైతం శంకర్ సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది.ఇకపోతే ఓ సందర్భంలో ఎన్టీఆర్ ని రాంచరణ్ కలవగా తనకు బుచ్చిబాబు ఒక స్టోరీ చెప్పారని ఆ కథ నీకైతే కరెక్ట్ గా సూట్ అవుతుంది ఒకసారి పిలిపించుకొని విను అని చెప్పగా రాంచరణ్ బుచ్చిబాబును పిలిపించుకొని స్టోరీ లైన్ చెప్పగానే రామ్ చరణ్ కు ఎంతో నచ్చిందని ఇలా బుచ్చిబాబు డైరెక్షన్లో రామ్ చరణ్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. ఇలా రామ్ చరణ్ కోసం ఎన్టీఆర్ తన సినిమాని త్యాగంతో వీరిద్దరి మధ్య ఎలాంటి స్నేహబంధం ఉందో అర్థం అవుతుంది.