బాలసుబ్రమణ్యం గురించి తనికెళ్ల భరణి చెప్పిన మాటలకి ఎవ్వరికైనా కంట్లో నీళ్ళు తిరగాల్సిందే !

బాలసుబ్రమణ్యం గురించి ప్రపంచం లో తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. ప్రముఖ గాయకుడిగా దేశ నలుమూలలా తన ప్రతిభని చాటుకున్నారు. గాన గంధర్వుడిగా ప్రతీ ఒక్కరి హృదయంలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎందరో కథా నాయకులకు తన గాత్రాన్ని అందించారు. సింగర్ గా .. నటుడుగా.. నిర్మాతగా..సంగీత దర్శకుడిగా ఖండాంతరాలలో తన ఉనికిని చాటుకున్నారు. ఇంతటి ఘనతను సాధించిన బాలసుబ్రమణ్యం కోవీడ్ వల్ల మరణించిన సంగతి తెలిసిందే.

కాగ గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్ని కేంద్ర ప్రభుత్వం ‘ పద్మవిభూషణ్ ‘ అవార్డుతో సత్కరించింది. తమిళనాడు రాష్ట్రం నుంచి బాలుకు ఈ అవార్డు లభించడం గొప్ప విషయం. 2021 సంవత్సరానికి గానూ మొత్తం ఏడుగురికి పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించగా.. వారిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి కూడా ఈ గౌరవం దక్కింది. దాదాపు దేశంలోని అన్ని భాషల్లోనూ బాలు పాటలు పాడారు. ఈ క్రమంలో కళారంగానికి ఆయన చేసిన విశేష సేవకు గుర్తింపుగా ఈ అవార్డును కేంద్రం ప్రకటించడం గొప్ప విశేషం.

బాలుకు పద్మ విభూషణ్ అవార్డు రావడంపై హర్షం వ్యక్తం చేశారు నటుడు రచయిత తనికెళ్ల భరణి. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ‘సింగర్ మీట్’ కార్యక్రమాన్ని నిర్వహించగా.. హాజరైన తనికెళ్ల భరణి.. బాలుతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. బాలుతో ‘మిథునం’ సినిమా రూపొందించడం.. ఆ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. బాలుతో ఉన్న అనుబంధాన్ని ఎప్పటికీ మరిచిపోలేమంటూ ఈ సందర్భంగా తెలిపారు. ఇక పర్యావరణ సమతుల్యాన్ని కాపాడకపోతే.. త్వరలోనే ప్రపంచ వినాశం తప్పదనే సత్యాన్ని కరోనా ఉదాహరణగా చూపించదని చెప్పుకొచ్చారు.