ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ ప్రమోషన్ కోసం ఏకంగా 80 కోట్లు ఖర్చు పెట్టారని. ఆ డబ్బు తనకి ఇస్తే ఎనిమిది సినిమాలు తీసి వారి ముఖాన కొడతా అంటూ సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. వీటిపై మెగా బ్రదర్ నాగబాబు సీరియస్ గా రియాక్ట్ అయ్యి నీ అమ్మ మొగుడు ఖర్చు పెట్టారా 80 కోట్లు అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు. ఇక రాఘవేంద్రరావు కూడా స్పందించి 80 కోట్లు ఖర్చు పెట్టినట్లు నీ దగ్గర అకౌంట్స్ ఉన్నాయా అయితే చూపించు.
అలాగే జేమ్స్ కామెరూన్ నీ దృష్టిలో అమ్ముడుపోయి ప్రశంసలు కురిపించాడా అంటూ ప్రశ్నించారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ విమర్శలపై తమ్మారెడ్డి భరద్వాజ మళ్ళీ రియాక్ట్ అయ్యారు. మూడు గంటల మీటింగ్ లో ఒక నిమిషం వీడియో చూసి ఎవరికి నచ్చినట్లు వారు మాట్లాడుతున్నారు. మొదటిగా నేను తప్పు చేయలేదు. ఆర్ఆర్ఆర్ గురించి రెండు రోజుల ముందే మాట్లాడాను. ఈ సినిమా దేశానికి గర్వకారణం అంటూ చెప్పాను. వాటిపై ఎవరూ రియాక్ట్ కాలేదు. అయితే ఒక్క నిమిషం వీడియో చూసి నీ అమ్మ మొగుడు అని ఒకడంటాడు.
అకౌంట్స్ చూపించమని మరొకడు అడుగుతాడు. నా అమ్మ మొగుడు నాకు సంస్కారం నేర్పించాడు. నిజం మాట్లాడటం నేర్పించాడు.అలా బూతులు మాట్లాడటం మీకు మాత్రమే వచ్చా… మాకు కూడా వచ్చు. అయితే సంస్కారం అడ్డు వస్తుంది. కులాలు, మతాల గురించి మాట్లాడే మీరు నా గురించి విమర్శిస్తారా? అసలు సంబంధం లేని వాళ్ళ ప్రస్తావన తీసుకొచ్చి మీరు ఏం మాట్లాడుతున్నారు? నేను ఏం మాట్లాడాను. మీ కారణంగా నేను ఇప్పుడు పెద్ద సెలబ్రిటీ అయిపోయాను.
నేను నోరు విప్పితే చాలా నిజాలు బయటకి వస్తాయి. కాని మీలా నేను దిగజారిపోలేను. ఇంతకాలం మనమంతా ఒకటే అనే ఫీలింగ్ ఉండేది. ఇప్పటికీ నాకు అలాగే ఉంది. అయితే మీరు నన్ను వేరు చేసి చూస్తున్నారు. ఎంత సేపు వారికి, వీరికి మర్దన చేయడానికే మీకు మర్దన చేయడానికే సమయం సరిపోతుంది. మీకు నా గురించి మాట్లాడే అర్హత లేదు అంటూ ఘాటుగా నాగబాబుపైన తమ్మారెడ్డి విమర్శలు చేశారు. అయితే నాగబాబు మీద చేసిన విధంగా రాఘవేంద్రరావు మీద తమ్మారెడ్డి కామెంట్స్ చేయకపోవడం గమనార్హం.