కాజ‌ల్ పెళ్లైంది, ఇక త్వ‌ర‌లో పెళ్లి పీట‌లెక్క‌నున్న హీరోయిన్ ఎవ‌రంటే ?

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్ చాలా మందే ఉన్నారు. ఈ ఏడాది కొంద‌రు అబ్బాయిలు ఓ ఇంటి వారు కాగా, రీసెంట్‌గా కాజ‌ల్ శ్రీమ‌తి ట్యాగ్ త‌గిలించుకుంది. ఇక త్వ‌ర‌లో పెళ్లిపీట‌లెక్కేందుకు మ‌రికొంద‌రు సిద్ధంగా ఉన్నార‌నే వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. మెగా హీరోయిన్ నిహారిక‌కి ఇప్ప‌టికే నిశ్చితార్ధం పూర్తి కాగా, త్వ‌ర‌లోనే వివాహ తంతు జరిపించ‌నున్నారు. నిహారిక పెళ్ళి త‌ర్వాత వరుణ్ తేజ్ వివాహం కూడా జ‌రిపేందుకు నాగ‌బాబు ప్లాన్ చేస్తున్నారు.

ఇక మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా కెరీర్ ప్ర‌స్తుతం గాడి త‌ప్పింది. పెద్ద ప్రాజెక్టులు రాక‌పోవ‌డంతో చిన్నా చిత‌కా సినిమాలు చేయ‌డం లేదంటే ఐటెం సాంగ్స్‌లో న‌ర్తించ‌డం వంటివి చేస్తుంది. 15 ఏళ్ళ పాటు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఓ ఊపు ఊపిన ఈ అమ్మ‌డి ప‌రిస్థితి ఇప్పుడు విభిన్నంగా ఉండ‌డంతో త్వ‌ర‌లో పెళ్లిపీట‌లెక్కేందుకు సిద్ధ‌మ‌వుతుంద‌నే టాక్ వినిపిస్తుంది. పెళ్ళైన హీరోయిన్‌లు కొంద‌రు ఇప్ప‌టికీ సినిమాలు చేస్తుండ‌గా, త‌మ‌న్నా ప‌రిస్థితి ఎలా ఉంటుందో చెప్ప‌లేం అని ఫ్యాన్స్ ముచ్చ‌టించుకుంటున్నారు.

ప్ర‌స్తుతం త‌మ‌న్నా .. గోపిచంద్ సరసన సీటీమార్ చిత్రం చేస్తుంది. ఇందులో క‌బ‌డ్డీ కోచ్‌గా న‌టిస్తుంది. అలానే `లవ్ మోక్ టైల్` రీమేక్, `గుర్తుందా శీతాకాలం`.. ,అంధాధున్ తెలుగు రీమేక్ సినిమాల్లో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఇందులో ఒక్క‌టి కూడా పెద్ద ప్రాజెక్ట్ లేక‌పోవ‌డం విశేషం. అయితే ఇప్ప‌టికీ బ్యాచిల‌ర్స్‌గా ఉన్న ప్ర‌భాస్, అనుష్క లు కూడా త్వ‌ర‌లో గుడ్ న్యూస్ చెప్ప‌నున్నార‌నే వార్తలు దావానంలా వ్యాపిస్తున్నాయి.