మిల్కీ బ్యూటీ తమన్నా ఇంట్లో కరోనా తాండవం చేస్తోంది. తాజాగా తాము చేయించుకున్న పరీక్షల ఫలితాలు వచ్చాయట. అందులో తన తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్ వచ్చిందని తమన్నా చెప్పుకొచ్చింది. అసలే ఈ కరోనా ఏ సెలెబ్రిటీలను వదలడం లేదు. ఇప్పటికే టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ సెలెబ్రిటీల ఇంట్లో కరోనా విజృంభించింది. ఇప్పుడు తమన్నా ఇంట్లోనూ కరోనా వచ్చింది. ఈ మేరకు తమన్నా చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.
‘గత వీకెండ్ నుంచి మా తల్లిదండ్రులకు చిన్నగా కోవిడ్ 19 లక్షణాలు మొదలయ్యాయ్.. ముందు జాగ్రత్తలో భాగంగా అందరం పరీక్షలు చేయించుకున్నాం. దాని ఫలితాలు తాజాగా వచ్చాయ్.. దురదృష్ట వశాత్తు మా పేరెంట్స్‌కి పాజిటివ్ వచ్చింది. సంబంధింత అధికారుల ఆదేశాల మేరకు మేమంతా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మా తల్లిదండ్రుల ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్స్‌ను ఇస్తున్నారు. మిగిలిన మా కుటుంబ సభ్యులు, నేను, మా స్టాఫ్ అందరికీ నెగెటివ్ వచ్చింది.
దేవుడి దయ వల్ల మా తల్లిదండ్రులు వైద్యానికి రియాక్ట్ అవుతున్నారు. మీ అందరి ప్రేమ, ఆశీస్సులు, ప్రార్థనల ద్వారా వారు ఇంకా త్వరగా కోలుకునే అవకాశం ఉంది’ అని తమన్నా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ఈ విషయంపై ఫ్యాన్స్‌తో పాటు సెలెబ్రిటీలు సైతం రియాక్ట్ అవుతున్నారు. దేవీ శ్రీ ప్రసాద్, సమంత, కాజల్ ఇలా అందరూ తమన్నాకు ఓదార్పు మాటలు చెబుతున్నారు.