చిత్ర పరిశ్రమను మరోసారి డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో పలువురు స్టార్ల పేర్లు తెరపైకి రావడంతో వారి అభిమానులు కలవరానికి గురవుతున్నారు. సౌత్‌లో ముఖ్యంగా టాలీవుడ్‌లో హీరోయిన్‌గా మంచి క్రేజ్ సంపాదించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ పేరు డ్రగ్స్ కేసులో ఉందనే వార్తలు వస్తుండటంతో ఆమె అభిమానులు ఆందోళనకు గురువుతున్నారు. డ్రగ్స్‌కేసులో నార్కొటిక్స్ అదికారులు అరెస్్ట చేసిన నటి రియా చక్రవర్తి పలువురు పేర్లను వెల్లడించిందని అందులో రకుల్ పేరు కూడా ఉన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంతో తనపై వస్తున్న అసత్య కథనాలను ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది రకుల్. ఈ క్రమంలో డ్రగ్స్ కేసు వ్యవహారంలో రకుల్ ప్రీత్ సింగ్ పేరున మరోసారి జాతీయ మీడియా హైలైట్ చేస్తోంది. రకుల్‌తో పాటు మరికొంత మంది సెలబ్రెటీలకు అధికారులు నోటీసులు జారీ చేశారని, విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో ఆమె సన్నిహితులతో పాటు, ఫ్యాన్స్ గందరగోళానికి గురువుతున్నారు.
అయితే డ్రగ్స్ సప్లయి చేసేవారి వివరాలను ఇవ్వాల్సిందిగా ఎన్సీబీ అధికారులు అడుగబోతున్నట్లు తెలుస్తోంది. వారి వివరాలను తమకు అందిస్తే ఈ కేసులో కొంత పురోగతి సాధిస్తామని, అంతేకాకుండా ఈ కేసు నుంచి సెలబ్రెటీలకు కాస్త ఉపశమనం కలుగుతుందని ఎన్సీబీ అధికారులు పేర్కొంటున్నారు. మరి ఎన్సీబీ అదికారులకు ఈ సెలబ్రెటీలు సహకరించి సేఫ్ అవుతారా? లేక తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేసి ఇరుకున పడతారా అనేది తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే. అయితే ఎన్సీబీ అదికారులకు సహకరించి ఈ కేసు నుంచి రకుల్ బయట పడాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.