ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలనే ఓ సామెత ఉంది కదా. అనసూయ దానికి భిన్నంగా కనిపిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అనసూయ ఓ రెబల్. ఆమె ధాటికి తట్టుకుని నిలబడాలంటే మామూలు విషయం కాదు. ఎంత మంది ట్రోల్స్ చేసినా సరే.. వారికి అంతే ధీటుగా కౌంటర్స్ ఇస్తుంది అనసూయ. అయితే ప్రస్తుతం ఉన్న అనసూయకి ఒకప్పటి అనసూయకు ఎంతో తేడా ఉందట. ఇదే విషయాన్ని అనసూయ తాజాగా చెప్పుకొచ్చింది.
అనసూయ తాజాగా అలీతో సరదాగా అనే కార్యక్రమంలో అతిథిగా విచ్చేసింది. ఇక ఈ షోలో అనసూయ ఎంతో ఎమోషనల్ అయింది. అదే సమయంలో భర్త, పిల్లల మాటలకు ఉబ్బితబ్బిబ్బైంది. ట్రోలింగ్ కారణంగా ఎంతటి వేదన అనుభవించిందో కూడా చెప్పుకొచ్చింది. మొదట్లో ఎంతో సున్నితంగా ఉండేదాన్ని అని, అయితే రాను రాను కఠినంగా తయారయ్యానని చెప్పుకొచ్చింది. కానీ ఇంట్లో మాత్రం ఇప్పటికీ ఏడుస్తుందట.
ఇంట్లో హెయిర్స్‌కు పెట్టుకునే పిన్ కనిపించకపోయినా ఏడుస్తుందట. ఈ విషయాన్ని అలీకి అనసూయ భర్తే చెప్పాడట. దీంతో అనసూయ కాస్త తన భర్తతో తియ్యని కోపాన్ని ప్రదర్శించింది. అది మా పర్సనల్ సీక్రెట్ అదెలా చెబుతాడు డర్టీ ఫెల్లో అంటూ కొంటెగా కస్సుమంది. అంటే అనసూయ ఇంట్లో మరింత సున్నితంగా ఉంటుందన్న మాట. కానీ బయట మాత్రం కాళీ రూపాన్ని చూస్తుంటాం.