దీపావళి కి ఆది పురుష్ నుంచి సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ ..?

ఇటీవలే రాధే శ్యామ్ సినిమాకి సంబంధించి ఇటలీ షెడ్యూల్ కంప్లీట్ చేసుకిని వచ్చాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఈ సినిమాని వీలైంత త్వరలో కంప్లీట్ చేసి బాలీవుడ్ సినిమా ఆదిపురుష్ ని మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నాడు. రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న రాధే శ్యామ్ కి మరో షెడ్యూల్ షూటింగ్ జరిపితే మేజర్ టాకీ పార్ట్ మొత్తం కంప్లీటవుతుందట.

అందుకే మరో నాలుగైదు రోజుల్లో హైదరాబాద్ లో రాధే శ్యామ్ షూటింగ్ మొదలు పెట్టనున్నారట, క్లైమాక్స్ సీన్స్ ని చిత్రీకరించేందుకు ఇప్పైకే 30 కోట్ల భారీ వ్యవయంతో సెట్ కూడా రెడీ అయింది. ఈ షెడ్యూల్ తో డిసెంబర్ వరకు రాధే శ్యామ్ షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. ఆ తర్వాత ప్రభాస్ నటిస్తున్న భారీ పాన్ ఇండియన్ సినిమా “ఆదిపురుష్” వచ్చే సంక్రాంతి తర్వాత మొదలు పెట్టాలని షెడ్యూల్స్ రెడీ చేస్తున్నారట.

బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ రామునిగా నటిస్తుండగా రావణ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. ఇందుకు సంబంధించి కాన్సెప్ట్ పోస్టర్స్ ని పెద్ద గ్యాప్ లేకండా రిలీజ్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చారు “ఆదిపురుష్” టీమ్. అయితే ఈ సినిమాలో మరో ప్రధాన పాత్ర అయిన సీత గా నటించబోయో హీరోయిన్ ఇంకా ప్రకటించలేదు. ఆ న్యూస్ కోసమే అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ దీపావళి పండుగ సందర్భంగా ఆ న్యూస్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

మరి “ఆదిపురుష్” టీమ్ ఇదే సర్‌ప్రైజ్ ని ప్లాన్ చేస్తున్నారా లేదా ఇంకేదైనా ప్లాన్ చేస్తున్నారా అన్నది మాత్రం సస్పెన్స్ గానే ఉంది. కాగా ప్రభాస్ ప్రస్తుతం ముంబై లో దర్శకుడి తో కలిసి చర్చల్లో పాల్గంటున్నాడు. కథ కి సంబధించిన చర్చల తో పాటు ప్రభాస్ కాస్ట్యూంస్… మేకోవర్.. హీరోయిన్.. ఇలా పలు అంశాలు ఫైనల్ చేయనున్నట్టు సమాచారం. మరి ప్రభాస్ లుక్ రిలీజ్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.