అక్టోబర్ 23 న యంగ్ రెబల్ స్టార్.. డార్లింగ్ ప్రభాస్ బర్త్ డే జరుపుకోబోతున్నారు. ఏ సినిమా స్టార్ బర్త్ డే అయినా వస్తుందంటే ఫ్యాన్స్ కి 15-20 రోజుల నుంచే సంబరాలు జరుపుకోవడం మొదలు పెడతారు. అలాంటిది పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ బర్త్ డే అంటే ఇక ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇప్పటికే డార్లింగ్ ఫ్యాన్స్ ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్ ని జరపాలని ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు ఆ రోజు ప్రభాస్ నటిస్తున్న భారీ సినిమాల నుంచి సర్‌ప్రజెస్ ఉంటాయని ఇప్పటి నుంచే ఆతృతగా చూస్తున్నారు.
అందుకు తగ్గట్టుగానే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమా నుంచి మూడు భారీ సర్‌ప్రైజులు రాబోతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీఖాన్ లంకేష్ అన్న పాత్రలో నటిహనున్నారన్న అఫీషియల్ న్యూస్ తప్ప మరేమి అప్‌డేట్స్ లేవు. అయితే ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాలో నటించబోతున్న సీత, అనుమాన్, లక్ష్మణ పాత్రలను ఒక్కొక్కటిగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇదే జరిగితే ఇక ఆరోజు సంచలనమే.
అలాగే ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న రాధే శ్యామ్మ్ సినిమా నుంచి టీజర్ వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇక నాగ్ అశిన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించబోతున్న వైజయంతీ మూవీస్ 50 వ సినిమా నుంచి టైటిల్ పోస్టర్ లేదా ప్రభాస్ లుక్ రిలీజ్ అవుతుందని సమాచారం. ఈ సినిమాల అప్‌డేట్స్ మాత్రమే కాకుండా కే.జీ.ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్టర్ గా ప్రభాస్ మరో పాన్ ఇండియన్ సినిమా చేస్తాడని చెప్పుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన అఫీషియల్ న్యూస్ కూడా ఆరోజే వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తుంది.
మరి ఫ్యాన్స్ ఇన్ని అప్‌డేట్స్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా వస్తాయని ఊహల్లో తేలిపోతున్నారు. నిజంగా ఈ సినిమాలన్నిటికి సంబంధించిన అప్‌డేట్స్ ప్రభాస్ ఇవ్వనున్నాడా లేక ఏదైనా మార్పులుండి ఫ్యాన్స్ కి షాక్ తగలబోతుందా అన్నది ఆ రోజు వస్తే గాని తెలియదు. ఏదేమైనా ఫ్యాన్స్ అన్నిటికి ప్రిపేర్ అయి ఉంటే బావుంటుందని టాక్.