సర్ప్రైజ్ : అప్పుడే బాలయ్య “అన్ స్టాప్పబుల్” మూడో సీజన్.. 

Unstoppable-with-NBK-2-Guests-Locked-for-the-Fourth-Episode1

తెలుగు స్మాల్ స్క్రీన్ అండ్ ఓటిటి లో అయితే సెన్సేషన్ హిట్ అయ్యిన ఓ టాప్ మోస్ట్ ఓటిటి షో “అన్ స్టాప్పబుల్” అని చెప్పాలి. నందమూరి నటసింహ బాలయ్య హోస్ట్ తో తెలుగు ఓటిటి యాప్ ఆహా లో రెండు సీజన్లని కంప్లీట్ చేశారు. అసలు బాలయ్య మొట్ట మొదటిసారిగా చేసిన షో ఇది కాగా..

దీనితో ఈ షో ఇండియా లోనే పెద్ద హిట్ అయ్యింది. మరి రెండో సీజన్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ముగించగా దీని తర్వాత మూడో సీజన్ ఎప్పుడు అనేది ఏమీ రివీల్ కాలేదు. అయితే ఇప్పుడు ఓ ఊహించని షాకింగ్ సర్ప్రైజ్ అయితే ఇప్పుడు తెలుస్తుంది. కాగా ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం అయితే..

మూడో సీజన్ ని ఆహా వారు ఈ దసరా కానుక గానే స్టార్ట్ చేయనున్నట్టుగా రూమర్స్ మొదలయ్యాయి. ఇది మాత్రం ఊహించని వార్తే అని చెప్పాలి. కాగా ఈసారి మొట్టమొదటి ఎపిసోడ్ కి గెస్ట్ గా టాలీవుడ్ నుంచి ఓ సెలెబ్రెటీని తీసుకొచ్చే ప్లాన్ లు ఉన్నాయట.

అయితే ఇది వరకే బాలయ్య మరియు చిరంజీవి లతో మెగా ఎపిసోడ్ ని ప్లాన్ చెయ్యడానికి అల్లు అరవింద్ బాగా ప్రయత్నం చేస్తున్నట్టుగా రూమర్స్ ఉన్నాయి. మరి మొట్ట మొదటి ఎపిసోడ్ అది కూడా ఇంత త్వరగా ఎలా ప్లాన్ చేస్తారు అనేది తెలియాల్సి ఉంది. అలాగే అతి త్వరలోనే అన్ స్టాప్పబుల్ మూడో సీజన్ తాలూకా అఫీషియల్ అప్డేట్ సహా టీజర్ లాంటివి కూడా వస్తాయని సమాచారం.