టాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో మంచి మంచి పాత్రలలో నటించి క్యారెక్టర్ ఆర్టిస్టుగా పొందిన నటి సురేఖ వాణి.అక్క,చెల్లి, అమ్మ, వదిన వంటి పాత్రలలో నటించి తన నటనతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. నిన్న వదల సినిమాలలో నటించిన సురేఖ వాణి ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది. తన భర్త చనిపోయిన సమయం నుండి తన కూతురితో కలిసి జీవిస్తున్న సురేఖ సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ అందాన్ని రెట్టింపు చేస్తూ కూతురికి పోటీగా నిలుస్తోంది.
మోడరన్ దుస్తులు ధరిస్తు తన కూతురికి అక్కలా కనిపించే సురేఖ వాణి కూతురితో కలసి డాన్స్ వీడియోలు , డబ్ స్మాశ్ వీడియోలు చేస్తు సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉంటుంది. అంతే కాకుండా సోషల్ మీడియాలో సురేఖ షేర్ చేసే ఫోటోలు కూడా వైరల్ గా మారుతూ ఉంటాయి. అప్పుడప్పుడు తన కూతురు, ఆమె స్నేహితులతో కలిసి వెకేషన్ కి వెళ్తూ తెగ ఎంజాయ్ చేస్తూ ఆ ఫోటోలు, వీడియో సరే కావాలిలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఇటీవల తన పబ్ లో తన కూతురి పుట్టిన రోజుని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది. ఈ బర్త్ డే పార్టీ కి సంబంధించిన వీడియోలు కూడా వైరల్ గా మారాయి.
ఇదిలా ఉండగా ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న సురేఖ వాణి తన పెళ్ళి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకి ప్రస్తుతం పెళ్ళి చేసుకునే ఉద్దేశం లేదని, కాకపోతే తన కూతురు మాత్రం తనని పెళ్ళి చేసుకోమని బలవంత పెడుతోందని వెల్లడించింది. ఇప్పటికే సురేఖ వాణి కూతురు తన తల్లికి రెండో పెళ్లి చేయాలనుకున్నట్లు ఎన్నోసార్లు వెల్లడించింది. ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న సురేఖ వాణీ తనకు ఇప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని, భవిష్యత్తులో ఆలోచన వస్తే తప్పకుండా చేసుకుంటాను. కాకుండా తనకు బాయ్ ఫ్రెండ్ ఉంటే బాగుంటుందని సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకి బాయ్ ఫ్రెండ్ గా ఉండే వ్యక్తి చాలా హైట్ గా హండ్సమ్ గా ఉండాలని, బాగా డబ్బు ఉండి నన్ను అర్థం చేసుకునే వ్యక్తి అయ్యుండాలని తన కోరికలు బయట పెట్టింది. బాయ్ ఫ్రెండ్ గురించి సురేఖ వాణి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వయసులో కూడా ఈమె కోరికలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.