Supritha: అమ్మకు రెండో పెళ్లి చేయాలని ఉంది… మనసులో మాట బయటపెట్టిన సురేఖ వాణి కూతురు!

Supritha: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఈ విధంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు పొందిన సురేఖవాణి తన కూతురు సుప్రీతతో కలిసి సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ క్రమంలోని ఈమె సోషల్ మీడియా వేదికగా తన కూతురుతో కలిసి చేసే డాన్స్ వీడియోలు భాగ వైరల్ అవుతుంటాయి. ఇకపోతే గతంలో సురేఖవాణి రెండవ పెళ్లి గురించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకున్న తర్వాత అదే బాటలోనే సుప్రీత కూడా పయనిస్తుందని ఆమె కూడా త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ విధంగా తన తల్లి గురించి వస్తున్న వార్తలపై సుప్రీత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇలా తన తల్లి గురించి లేనిపోని వార్తలు రాయడం వల్ల తాను ఎంతో ఇబ్బంది పడుతోంది అంటూ సోషల్ మీడియా వేదికగా తన తల్లి రెండవ పెళ్లి గురించి వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు.

తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన తల్లి రెండవ పెళ్లి గురించి తన మనసులో ఉన్న మాటను బయట పెట్టారు. తనకు అయితే తన తల్లికి రెండో పెళ్లి చేయాలని చాలా ఉందని కానీ అది అమ్మ ఇష్ట ప్రకారమే జరగాలని ఈమె తెలియచేశారు. పెళ్లి చేసుకోవడం వద్దు అనుకోవడం పూర్తిగా అమ్మ సమ్మతంతోనే జరుగుతుందని తెలిపారు. చిన్నప్పటినుంచి ఈ కుటుంబానికి అమ్మ ఒక వెన్నెముకగా ఉండి సపోర్ట్ చేశారు నాన్నకు కొన్నిసార్లు ఉద్యోగం లేకపోయినా అమ్మ కుటుంబాన్ని ఎంతో అద్భుతంగా ముందుకు నడిపించారు. అలాంటిది అమ్మ పెళ్లి చేసుకోవాలా వద్దా అనేది తన నిర్ణయానికే వదిలేస్తున్నామని అయితే అమ్మ పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందని సుప్రీత తెలిపారు. ఇక తాను కూడా తన తల్లి ఇష్ట ప్రకారమే నడుచుకుంటానని తన తల్లి నిర్ణయమే తన నిర్ణయం అంటూ సురేఖ వాణి తన తల్లి రెండవ పెళ్లి గురించి మనసులో ఉన్న మాటను బయట పెట్టారు. ఈ క్రమంలోనే సుప్రీత చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.