Chiranjeevi: నా విజయానికి కారణం సురేఖ… మెగాస్టార్ కామెంట్స్ వైరల్!

Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకుని సక్సెస్ ఫుల్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉన్నారు.ఈ విధంగా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న చిరంజీవి తన విజయం వెనుక తన భార్య సురేఖ ప్రమేయం 100 శాతం ఉందని ఇది వరకు ఎన్నో సందర్భాలలో వెల్లడించారు. ఇకపోతే నేడు మహిళా దినోత్సవం కావడంతో మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి నగరంలో ఉన్న బ్లడ్ బ్యాంక్ సెంటర్ లో మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా సినీ పరిశ్రమకు చెందిన పలువురు మహిళలకు మెగాస్టార్ దంపతులు సన్మాన కార్యక్రమాలను చేపట్టారు అనంతరం ఈ కార్యక్రమంలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ కుటుంబ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చడానికి ప్రాధాన్యత ఎంతో ఉంటుందని ఆయన తెలియజేశారు.అయితే ప్రస్తుత కాలంలో ఎంతోమంది మహిళలు కుటుంబ బాధ్యతలను నెరవేరుస్తూ వివిధ రంగాలలో పురుషులకు సమానంగా రాణిస్తున్నారని చంద్రమండలం నుంచి ఒలంపిక్స్ స్థాయిల వరకు మహిళలు తీవ్రంగా కృషి చేస్తున్నారనీ ఈ సందర్భంగా మహిళలపై చిరంజీవి ప్రశంసలు కురిపించారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచం గర్వించేలా స్త్రీ శక్తి ఎదగాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఇక తన జీవితంలో తన విజయాల వెనుక కూడా ఓ మహిళా శక్తి ఉందని చిరంజీవి మరోసారి తన భార్య సురేఖ గురించి మాట్లాడారు. ఇండస్ట్రీలో తాను సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్నాను అంటే తన విజయం వెనుక సురేఖ హస్తం ఉందని మరోసారి చిరంజీవి వెల్లడించారు. సురేఖ కుటుంబ బాధ్యతలు తీసుకోవటం వల్ల తాను వంద శాతం సినిమాలపై దృష్టి పెట్టానని అందుకే తాను ఇండస్ట్రీలో ఎంతో సక్సెస్ ఫుల్ హీరోగా రాణించగలిగానని చిరంజీవి ఈ సందర్భంగా సురేఖ గురించి వెల్లడించారు.