Supritha: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖ వాణి గురించి అందరికీ తెలిసిందే. ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే కరోనా లాక్ డౌన్ సమయంలో సురేఖ వాణి సోషల్ మీడియాలో ఎంతో పాపులర్ అయ్యారు. ఇదే సమయంలో తన కూతురు సుప్రీతని కూడా అందరికీ పరిచయం చేశారు.ఈ విధంగా తక్కువ సమయంలోనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న సుప్రీత సోషల్ మీడియా వేదికగా తన తల్లితో కలిసి చేసే హంగామా మామూలుగా ఉండదు.
ఈ విధంగా పొట్టి పొట్టి దుస్తులు ధరించి తల్లితో కలిసి డాన్స్ వీడియోలు చేస్తూ అభిమానులను సందడి చేస్తుంటారు. ఈ క్రమంలోనే సుప్రీత ఎన్నోసార్లు నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు. ఇలా ఎన్నో సార్లు నెటిజనులు ఈమెను దారుణంగా నెగిటివ్ కామెంట్లతో ట్రోల్ చేశారు. ఇలా ఎన్నో సార్లు నెటిజన్ల ట్రోలింగ్ కి గురి అయినప్పటికీ ఈమె మాత్రం వాటిని పట్టించుకోకుండా సోషల్ మీడియాలో దూసుకుపోతున్నారు.
ఈ విధంగా సోషల్ మీడియాలో తన తల్లితో కలిసి ఈమె చేసే రచ్చతో పాటు ఈమె ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేస్తూ ఎంతో మంది అభిమానులను పొందారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా మరొక పోస్ట్ చేశారు.నేను నా జీవితంలో నుంచి ఒక విషయాన్ని ఎంత తొలగించుకోవాలని ప్రయత్నించినప్పటికీ అది నన్ను వదిలి వెళ్లడం లేదు. నా జీవితంలో నుంచి నెగిటివిటీ తొలగించుకోవాలని దానిని ఎంత దూరం విసిరికొట్టినా తిరిగి నా దగ్గరికి వస్తుంది అంటూ ఈమె చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.