ఆ విషయంలో ఏ హీరో సాధించలేని రికార్డ్ సృష్టించిన సూపర్ స్టార్ కృష్ణ?

టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ కృష్ణ మరణించడం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని చెప్పాలి.ఇలా కృష్ణ మరణ వార్త తెలియగానే తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం ఆయన చివరి చూపు కోసం తరలి వెళ్ళింది. ప్రస్తుతం కృష్ణ పార్థివ దేహాన్ని గచ్చిబౌలి స్టేడియంలో అభిమానుల సందర్శనార్థం ఉంచారు. ఇక ఈయన అంత్యక్రియలను రేపు మధ్యాహ్నం 3 గంటలకు మహా ప్రస్థానంలో అధికారకలాంచనాలతో నిర్వహించనున్నారు. ఇలా కృష్ణ గారు మరణించడంతో ఆయన సినీ కెరీర్ గురించి పలువురు గుర్తు చేసుకుని ఎమోషనల్ అవుతున్నారు.

ఇకపోతే కృష్ణ ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కృష్ణ ఎన్నో అద్భుతమైన సినిమాలను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈయన కౌబాయ్ జేమ్స్ బాండ్ వంటి సినిమాలను తెలుగు తెరకు పరిచయం చేశారు.ఇకపోతే కృష్ణ అప్పట్లో ఎన్నో ప్రయోగాత్మక సాహసభరితమైన సినిమాలను చేయడమే కాకుండా ఇలాంటి సినిమాలలో నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇకపోతే అప్పట్లో కృష్ణకు కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా ఎంతోమంది అభిమానులు ఉండేవారు.

ఇలా ప్రతి ఒక్క హీరోకి అభిమాన సంఘాలు ఉండడం సర్వసాధారణం అయితే కృష్ణకు మాత్రం ఏకంగా 2500 అభిమాన సంఘాలు ఉండేవి. అయితే ఈ అభిమాన సంఘాలలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక అభిమాన సంఘాన్ని నిర్మించడమే కాకుండా ఆ అభిమాన సంఘానికి అధ్యక్షుడిగా కూడా కొనసాగారు. ఇలా చిరంజీవి సైతం కృష్ణ గారికి అభిమాని మాత్రమే కాకుండా అభిమాన సంఘానికి నాయకుడుగా వ్యవహరించారు. ఇలా వేల సంఖ్యలో అభిమాన సంఘాలను కలిగి ఉన్న ఏకైక హీరో కృష్ణ అని అలాంటి రికార్డు కేవలం కృష్ణ గారికి మాత్రమే సొంతమైందని చెప్పాలి.