“హనుమాన్” లో బాలయ్య చెల్లికి అదిరిపోయే రోల్.!

ఇప్పుడు టాలీవుడ్ నుంచి ఎన్నో పాన్ ఇండియా సినిమాలు రావచ్చు కానీ ప్రైడ్ పాన్ ఇండియా సినిమా మాత్రం ఏదన్నా ఉంది అంటే అది యంగ్ హీరో తేజ సజ్జ మరియు టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం “హను మాన్” కూడా ఒకటి. అయితే ఈ భారీ సినిమా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న “ఆదిపురుష్” కన్నా ఎక్కువ ఈ హనుమాన్ అనే చిన్న సినిమా కోసం ఎక్కువ ఆడియెన్స్ మాట్లాడుకోవడం విశేషం గా మారింది.

అయితే టీజర్ వచ్చాక ఒక్కసారిగా అంచనాలు మార్చేసిన ఈ సినిమాలో రీసెంట్ గా భారీ హిట్ సినిమా వీరసింహా రెడ్డి లో బాలయ్య కి చెల్లెలిగా సాలిడ్ పెర్ఫామెన్స్ ని కనబర్చిన వెరీ టాలెంటెడ్ అండ్ వెర్సటైల్ నటి అయ్యినటువంటి వరలక్ష్మి శరత్ కుమార్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈమెపై గత ఏడాది ఇదే రోజున బర్త్ డే కానుకగా ఆమె లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. అయితే ఈసారి మాత్రం ఆమె ఈ సినిమాలో చేస్తున్న అసలు రోల్ ఏంటో రివీల్ చేశారు. ఈ చిత్రం లో వరలక్ష్మి అయితే హీరో తేజ సజ్జ చేసిన హనుమంతు పాత్రకి తల్లిగా అంజమ్మ పాత్రలో నటిస్తున్నట్టుగా మరో ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేశారు.

దీనితో కాస్టింగ్ పరంగా కూడా ఈ సినిమా అదిరే లెవెల్లో ఉందని చెప్పాలి. మరి ఈ భారీ సినిమా అయితే ఆదిపురుష్ కన్నా బెటర్ విజువల్స్ తో వస్తుండగా వరల్డ్ వైడ్ గా అనేక దేశాల్లో ఈ చిత్రం మే 12న రిలీజ్ కాబోతుంది.