మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ ఇకలేరు?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కృష్ణ గుండెపోటు రావడంతో ఆదివారం గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఈయన ఆరోగ్య పరిస్థితి తీవ్రతరంగా ఉండడంతో వైద్యులు ఇతనిని వెండి లెటర్ పై ఉంచి చికిత్స అందించారు. ఈ విధంగా ఈయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో అభిమానుల ఆందోళన చెందారు. ఇక వైద్యులు సైతం 24 గంటలు గడిస్తే గాని ఏ విషయం చెప్పలేమని చెప్పారు.

ఇకపోతే నేడు తెల్లవారుజామున నాలుగు గంటలకు కృష్ణ గారికి తీవ్రమైన అస్వస్థత చేయడంతో ఈయన తుది శ్వాస విడిచారు. ఈ విధంగా కృష్ణ మరణించడంతో ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కృష్ణ ఆస్పత్రిలో చేరుకున్నారని తెలియగానే కుటుంబ సభ్యులందరూ కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. మహేష్ బాబు కుటుంబ సభ్యులతో పాటు ఆయన కూతుర్లు అల్లుళ్ళు మనవళ్ళు మనవరాలు అందరూ కూడా ఆసుపత్రి వద్దా ఉన్నారు.

ఇక నేడు తెల్లవారుజామున నాలుగు గంటలకు కృష్ణ తుది శ్వాస విడిచారనీ తెలియగానే ఒకసారిగా సినీ ప్రపంచం అభిమాన లోకం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.1942 వ సంవత్సరంలో జన్మించిన కృష్ణ1965 వ సంవత్సరంలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి తెలుగు చిత్ర పరిశ్రమలు సూపర్ స్టార్ కృష్ణగా పేరుపొందారు. ఇక చిత్ర పరిశ్రమకు ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలను అందించారు. దర్శకుడిగా నిర్మాతగా నటుడిగా ఇండస్ట్రీకి ఎన్నో సేవలు చేసిన కృష్ణ మరణం ఇండస్ట్రీకి తీరనిలోటు అని చెప్పాలి.