Sunny Leone: మంచు విష్ణు ఇంట్లో ఆలు పరాటాలు చేస్తున్న సన్నీ లియోన్… వీడియో వైరల్!

Sunny Leone: మంచు విష్ణు మా అధ్యక్షుడు అయిన తర్వాత గాలి నాగేశ్వరరావు అనే చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్లో శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాలో విష్ణు సరసన బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ నిమిత్తం సన్నీలియోన్ హైదరాబాద్లో సరదాగా గడుపుతున్నారు. ఇలా గాలి నాగేశ్వరరావు సినిమాకు సంబంధించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ క్రమంలోనే తాజాగా సన్నీలియోన్ మంచు విష్ణుకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.ఈ వీడియోలో భాగంగా మంచు విష్ణు నటి సన్నీలియోన్ ఆలూ పరాటాలు ఏవిధంగా తయారు చేయాలో నేర్పుతున్నారు. మంచు విష్ణు చెప్పిన విధంగానే సన్నీలియోన్ ఆలూ పరాటాలు తయారు చేస్తోంది. ఇలా సన్నీలియోన్ మంచు విష్ణు ఇంటిలో ఆలు పరాటాలు చేస్తున్నటువంటి వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఈ వీడియోలో భాగంగా మంచు విష్ణు సన్నీలియోన్ సరదాగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే సన్నీ లియోన్ లంగా ఓని ధరించి ఎంతో పద్ధతిగా చూడముచ్చటగా ఉన్నారు. ఇలా సన్నీ లియోన్ తో సరదాగా గడిపిన మంచు విష్ణు తన కాలేజీ రోజులను గుర్తు చేసుకున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో శృంగార తారగా పేరు సంపాదించుకున్న ఈమె తెలుగులో గతంలో మంచు మనోజ్ కరెంటు తీగ సినిమాలో సందడి చేశారు. అనంతరం తిరిగి మంచు విష్ణు సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.