కోలీవుడ్ టాక్ : “జైలర్” లో సునీల్ రోల్ ఈ టాలీవుడ్ హీరో ఆధారంగా?

లేటెస్ట్ గా తమిళ సినిమా దగ్గర చాలా రోజులు నుంచి కోరుకుంటున్న మరో భారీ హిట్ చిత్రం సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన “జైలర్” రూపంలో అయితే దక్కింది అని చెప్పాలి. కాగా ఈ చిత్రం రిలీజ్ అయ్యి రికార్డు వసూళ్లు కొల్లగొడుతూ ఉండగా ఈ చిత్రంని దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ అనేక ఇండస్ట్రీ వర్గాల నుంచి పలువురు స్టార్ హీరోస్ నటుల్ని కలిపి తెరకెక్కించడం ఒకెత్తు అయితే వారిని అద్భుతంగ హ్యాండిల్ చేయడం అనేది ఇంకా ఇంట్రెస్టింగ్ గా మారింది.

ఐతే ఈ అందరిలో కూడా మన టాలీవుడ్ నుంచి కమెడియన్ సునీల్ కూడా నటించాడు. సినిమా సెకండాఫ్ లో కీలక పాత్రలో కమెడియన్ గా ఆకట్టుకున్న తన పాత్ర డిఫరెంట్ గా ఉంటుంది. అయితే సునీల్ ని ఓ పేరు మోసిన హీరోగా అలాగే ఓ పేరు మోసిన కుటుంబం నుంచి వచ్చిన ప్రముఖుడు గా కూడా చూపిస్తారు. 

వీటితో పాటుగా సినిమాలో తనకి కొంచెం క్రాక్ ఉన్నట్టుగా కూడా చూపిస్తారు. అయితే ఇవన్నీ కూడా మన టాలీవుడ్ లో అగ్ర శ్రేణి నటుడ్ని టార్గెట్ గా చేసుకొని డిజైన్ చేసిన పాత్రే అని అతను కూడా ఇలాగె ఎప్పుడు ఎలా ఉంటాడో తెలీదు సినిమాలో హీరోయిన్స్ తో సీన్స్ లాంటి వాటివి కూడా ఆ హీరో ఆధారంగానే చేశారు అని అంటున్నారు.

మరి ఆ సీనియర్స్ స్టార్ హీరో ఎవరో ఈపాటికే అర్ధం అయ్యి ఉంటుంది. పైగా కొన్ని సీన్స్ లో సేమ్ విగ్గు మెడలో గొలుసు లాంటివి కూడా ఉన్నాయని ఆ హీరో ఆధారంగానే సునీల్ పాత్రని నెల్సన్ డిజైన్ చేసాడు అని తమిళ ఎంటర్టైనింగ్ సోషల్ మీడియా వర్గాలు చెప్తున్నాయి. దీనితూ ఇది నిజమేనా అన్నట్టుగా ఇది వైరల్ గా మారింది.