సునీల్ ‘వేదాంతం రాఘవయ్య’ మూవీ ప్రారంభం

suneel new movie vedantham ragavaiah started

సునీల్ హీరోగా రెండేళ్ల తర్వాత వస్తున్న సినిమా “వేదాంతం రాఘవయ్య”. 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తున్న ఈ సినిమాను సి.చంద్రమోహన్ డైరెక్ట్ చేస్తున్నారు. స్టార్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ ఈ సినిమాకు క‌థ‌ అందించ‌డంతో పాటు స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హరిస్తున్నారు. శనివారం ఈ సినిమా ప్రారంభించారు. హీరోగా సరైన సక్సెస్ లు లేని సునీల్ ఈమధ్య తిరిగి కమెడియన్ వేషాలు వేస్తున్నాడు. వాటితో పాటుగా విలన్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు.. వేదాంతం రాఘవయ్య.. టైటిల్ లోనే ఏదో కొత్త సౌండింగ్ ఉంది. కచ్చితంగా సునీల్ ఈ సినిమాతో సంథింగ్ స్పెషల్ గా రాబోతున్నాడని చెప్పొచ్చు. చంద్రమోహన్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు హరీష్ శంకర్ కథ అందించడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.

suneel new movie vedantham ragavaiah started
suneel new movie vedantham ragavaiah started

సునీల్ చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. హరీష్ శంకర్ డైరక్షన్ తో పాటుగా ఇలా కథలను కూడా రాస్తూ వేరే వాళ్లకు ఇస్తున్నాడు. తప్పకుండా ఈ సినిమాతో హరీష్ శంకర్ కు కూడా మంచి పేరు వస్తుందేమో చూడాలి. సునీల్ ఈమధ్య వచ్చిన కలర్ ఫోటో సినిమాలో విలన్ గా చేయగా ఎన్.టి.ఆర్, త్రివిక్రం సినిమాలో కూడా ప్రత్యేకమైన పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాలోని ఈ పాత్ర కోసం సునీల్ స్పెషల్ హార్డ్ వర్క్ చేస్తున్నాడట. కలర్ ఫోటో తర్వాత సునీల్ లోని విలన్ యాంగిల్ ను డైరక్టర్స్ వాడుకోవాలని చూస్తున్నారు.