Suman: అల్లు అర్జున్ కి ఒక రూల్… వారికి మరొక రూలా.. బన్నీ అరెస్టుపై ఘాటుగా రియాక్ట్ అయిన సుమన్?

Suman: అల్లు అర్జున్ అరెస్టు కావడంతో సినీ ఇండస్ట్రీ మొత్తం ఈయన అరెస్టును పూర్తిగా ఖండించడమే కాకుండా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి ఆయనని పరామర్శిస్తూ వచ్చారు. ఇలా ఇప్పటికే ఎంతోమంది డైరెక్టర్లు నిర్మాతలు హీరోలు అందరూ కూడా అల్లు అర్జున్ ఇంటికి గత రెండు రోజుల నుంచి క్యూ కడుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రముఖ సినీ నటుడు సుమన్ సైతం అల్లు అర్జున్ అరెస్ట్ గురించి స్పందించారు.

ఈ సందర్భంగా హీరో సుమన్ మాట్లాడుతూ.. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా అల్లు అర్జున్ అరెస్టు చేయడం ముమ్మాటికి తప్పు అని ఆయన తెలిపారు. ఒక హీరోని థియేటర్ కి పిలిచిన తర్వాత థియేటర్ యాజమాన్యం సరైన సెక్యూరిటీని కల్పించాల్సిన అవసరం కూడా ఉంది .ఈ విషయంలో థియేటర్ యాజమాన్యం విఫలమైందని తెలిపారు. ఇలా ఒక వ్యక్తి మరణం ఆ కుటుంబానికి తీరనిలోటు అలాగే ఒక అభిమాని మరణం కూడా ఎంతో బాధాకరమని ఈయన తెలిపారు.

థియేటర్ యాజమాన్యం హీరోలను పిలిచినప్పుడు సరైన విధంగా భద్రత కల్పించాలని చెప్పడానికి ఇది ఒక గుణపాఠమని సుమన్ తెలిపారు. దయచేసి సరైన సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నప్పుడే హీరోలను థియేటర్లకు పిలవండి అంటూ ఈయన కోరారు. ఇక గతంలో అనేక ఘటనలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. వాటి గురించి ఎందుకు మాట్లాడరు. వాళ్లకో రూలు.. అల్లు అర్జున్ కు ఒక రూలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సుమన్.

ఇలా గతంలో కూడా ఎంతో మంది రాజకీయ నాయకులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలు అలాగే ర్యాలీలలో కూడా తొక్కిసలాట జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు కానీ రాజకీయ నాయకులను ఇలాంటి కేసులో ఎక్కడ అరెస్టు చేసిన దాఖలాలు కనిపించలేదు. కానీ అల్లు అర్జున్ విషయంలో మాత్రం పోలీసులు వ్యవహరించిన తీరును పూర్తిస్థాయిలో తప్పు పట్టడమే కాకుండా ఈయన అరెస్టు వెనుక రాజకీయ కుట్ర కూడా దాగి ఉందని పలువురు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.