బుల్లితెర క్వీన్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో దశాబ్ధాలుగా ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్న సుమ వినోదం పంచడమే కాదు ఎల్లప్పుడు మంచి విషయాలను చెబుతూ ప్రేక్షకుల హృదయాలలో చెరగని స్థానం సంపాదించుకుంది. ముఖ్యంగా కరోనా సమయంలో సుమ తన సోషల్ మీడియా ద్వారా ప్రజలని అప్రమత్తం చేస్తూ, ఎప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తూ వచ్చింది. అయితే షోస్‌తో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సామాజిక మాధ్యమాల ద్వారాను అభిమానులతో టచ్‌లో ఉంటుంటుంది.
తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేసిన సుమ .. మల్లెపూలు అమ్మే మహిళకు కరోనా జాగ్రత్తలు చెప్పింది. మాస్క్‌తో ఉన్న సుమని చూసి ఇట్టే గుర్తు పట్టిన మహిళ వెంటనే మాస్క్ తొలగించి బాగున్నారా మేడం అని అడిగింది. దీంతో సుమ.. మాస్క్ ఎప్పుడు పెట్టుకోవాలి, నన్ను చూస్తే ఎగ్జైట్‌మెంట్ అన్నీ ఉంటాయి కాని మీ సేఫ్ కోసం మాస్క్ ధరించాలి అని స్పష్టం చేసింది. మిమ్మల్ని చూసిన ఆనందంతో మాస్క్ తీసానని మహిళ అనడంతో చిన్న చిరునవ్వు చిందించిన సుమ .. మల్లెపూలు ఎంత అని అడిగింది. దీంతో సదరు మహిళ 20 రూపాయలు అని చెప్పింది. వీరిద్దరి మధ్య జరిగిన ఈ చర్చకు సంబంధించిన వీడియోని సుమ తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఫుల్ వైరల్‌గా మారింది.
సుమకు సామాజిక స్పృహ చాలా ఉందని, సామాన్యులతోను ఎంతో ప్రేమగా మాట్లాడుతున్న సుమకు జేజేలు అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇదిలా ఉంటే సుమ తన తనయుడు రోషన్‌ని హీరోగా పరిచయం చేస్తుంది. రీసెంట్‌గా రోషన్ ప్రాజెక్టుకి సంబంధించి పూజా కార్యక్రమాలు పూర్తి కాగా, త్వరలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళనుంది.