Anchor Suma: బాస్ నాన్ స్టాప్ లో సందడి చేసిన సుమ!

Anchor Suma: టాలీవుడ్ బుల్లితెరపై స్టార్ యాంకర్ గా కొనసాగుతున్న సుమ కనకాల గురించి తెలియని వారెవ్వరూ లేరు. ఇక ఈమె యాంకరింగ్ చేసే విధానం గురించి ఎంత చెప్పినా తక్కువే. తన మాటలతో అందరిని ఆకట్టుకుంది. ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది. ఇక బుల్లితెరపై మాత్రం స్టార్ గా నిలిచింది. ఇక ఆమె వేసే పంచ్ లు మాత్రం ఓ రేంజ్ లో పేలుతుంటాయి.

సుమ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది. తీరికలేని లైఫ్ గడుపుతున్న సుమ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచింది. ఇప్పటివరకు తన యాంకరింగ్ విషయంలో కానీ, తన మాటల్లో గాని ఎటువంటి నెగటివ్ ను దరికి రానీయకుండా ముందుకు సాగుతుంది. ఎన్నో సినిమా ఈవెంట్లలో కూడా సుమ బాగా సందడి చేస్తుంది.

ఒక సినిమా ఈవెంట్ లోనే కాదు సినీ సెలబ్రెటీలను ఇంటర్వ్యూ చేసే విధానంలో కూడా సుమ చేసే రచ్చ బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ మధ్య సుమ యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించగా అందులో తనకు సంబంధించిన కామెడీ వీడియోలను, పలు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలను అభిమానులకు తెగ పంచుకుంటుంది. అంతేకాకుండా తను ఇంట్లో చేసే అల్లరి పనులను కూడా తెగ షేర్ చేస్తుంది.

ఇదంతా పక్కన పెడితే.. స్టార్ మా తో సుమకు మంచి సంబంధం ఉంది. ఎందుకంటే.. స్టార్ మా లో ప్రసారం అవుతున్న ప్రతి బిగ్ బాస్ సీజన్ కు సుమ ఎంట్రీ ఖచ్చితంగా ఉంటుంది. ఇక అందులో పాల్గొని ఆమె చేసే సందడి మాత్రం మాటల్లో చెప్పలేము. నిజానికి సుమ బిగ్ బాస్ కి ఎంట్రీ ఇచ్చినప్పుడు రేటింగ్ కూడా హై లో ఉంటుంది. అలా తాజాగా బిగ్బాస్ నాన్ స్టాప్ కు కూడా ఎంట్రీ ఇచ్చి అందరి దృష్టిని తాకింది.

తన మాటలతో, తన పంచులతో అందరిని ఆట పట్టించింది. ఇక మిత్ర ను పంపు కాదు పాతాళగంగ అంటూ కౌంటర్ వేసింది. ఇక తనను తన భర్తనన్న చూడకుండా ఉంటాడేమో కానీ బిగ్ బాస్ మాత్రం తనను చూడకుండా ఉండడని కామెంట్ చేసింది.