Suma Kanakala: కాలుజారి కిందపడిన సుమ.. తప్పిన పెను ప్రమాదం!

Suma Kanakala: బుల్లితెర యాంకర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న సుమ జయమ్మ పంచాయతీ సినిమా ద్వారా వెండితెర ప్రేక్షకులను సందడి చేయడానికి మన ముందుకు వచ్చింది.ఇలా జయమ్మ పంచాయతీ సినిమా ద్వారా వెండితెర ప్రేక్షకులను సందడి చేస్తున్న సుమ ఈ సినిమా షూటింగ్ లో భాగంగా జరిగిన ఒక ప్రమాదం గురించి బయట పెట్టారు. ఈ సినిమా షూటింగులో భాగంగా నీళ్ళు పారుతున్న కాలువ వద్ద సుమ నిలబడ్డారు.ఈ క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని సుమ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియోని షేర్ చేశారు.

ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా అడవిలో షూటింగ్ చేశారు. అయితే అక్కడ కాలువ నీళ్లు పాడుతూ ఉండగా సుమ అక్కడ నిలబడ్డారు. అయితే ఇది దాటుకుంటూ ఉన్న సమయంలో సుమ ఒక్కసారిగా కాలు జారి కింద పడ్డారు. ఈ క్రమంలోనే ఈ వీడియోని సుమ షేర్ చేయడంతో అతి తక్కువ సమయంలోని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

కొందరు సుమక్క జాగ్రత్త అంటూ కామెంట్ చేయగా… మరికొందరు ఎలాంటి ప్రమాదం జరగలేదు సంతోషం అంటూ కామెంట్ చేస్తున్నారు. ఏదిఏమైనా సుమ ప్రమాదం నుంచి బయట పడిందని చెప్పాలి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జయమ్మ పంచాయతీ సినిమా ద్వారా మే 6వ తేది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిశ్రమ స్పందన దక్కించుకుంది.