Gallery

Home News క్యాష్ ప్రోగ్రాంలో క‌న్నీరు పెట్టుకున్న యాంక‌ర్ ర‌వి, సుమ‌.. ఎందుకో తెలుసా?

క్యాష్ ప్రోగ్రాంలో క‌న్నీరు పెట్టుకున్న యాంక‌ర్ ర‌వి, సుమ‌.. ఎందుకో తెలుసా?

సుమ హోస్ట్‌గా స‌క్సెస్‌ఫుల్‌గా దూసుకెళుతున్న బుల్లితెర షో క్యాష్‌.దొరికిత‌నంత దోచుకో అనేది ట్యాగ్ లైన్. కొన్నేళ్ళుగా స‌క్సెస్ ఫుల్‌గా న‌డుస్తున్న ఈ షోకు ఇండ‌స్ట్రీకు సంబంధించి ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌వుతుంటారు. వారి చేత సుమ ప‌లు గేమ్స్ ఆడిస్తూనే జన‌ర‌ల్ నాలెడ్జ్‌కు సంబంధించిన ప్ర‌శ్న‌లు అడుగుతూ ఉంటుంది. గేమ్ చివ‌ర‌లో ర్యాంప్ పై నుండి వ‌స్తువులు కింద ప‌డిపోయి ప‌గిలిపోతుంటే అవి చూసిన వారి గుండె త‌రుక్కుపోతుంటుంది.

తాజాగా క్యాష్ షోకి సంబంధించిన ప్రోమో విడుద‌ల చేశారు. ఇందులో ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోష‌న‌ల్ కూడా చూపించారు. యాంక‌ర్ ర‌వి, వ‌ర్షిణి, భాను. జ‌బ‌ర్ద‌స్త్ న‌టుడు కార్తీక్ షోకి త‌మ మాతృమూర్తితో క‌లిసి హాజ‌రయ్యారు. ప్రోమోలో కొద్ది సేపు యాంక‌ర్ ర‌వి..సుమ‌తో ఆడుకునే ప్ర‌య‌త్నం చేయ‌గా, ఆమె కూడా రివ‌ర్స్ పంచ్‌లు ఇస్తూ షోని ర‌క్తిక‌ట్టించింది. ఇక చివ‌ర‌లో చంద‌మామ క‌థ‌లు అంటూ త‌ల్లితో దిగిన ఫోటోలు షేర్ చేస్తూ.. జ‌బ‌ర్ధ‌స్త్ న‌టుడు కార్తీక్‌ని నువ్వు ఏమైన చెప్పాల‌ని అనుకుంటున్నావా అని అడిగింది సుమ‌.

4003E885 3Aec 4D14 86D9 5392769056C7 | Telugu Rajyam

జ‌బ‌ర్ధ‌స్త్ షో మంచి పేరు ప్ర‌ఖ్యాతలు పొందిన కార్తీక్‌.. త‌ల్లి గురించి మాట్లాడుతూ.. నా త‌ల్లి యోధురాలు. రెండు సంవ‌త్స‌రాల నుండి 30 కీమో థెర‌పీలు, రెండు మేజ‌ర్ స‌ర్జ‌రీలు చేయించుకుంది. జ‌బ‌ర్ధ‌స్త్‌లో సంపాదించిన మ‌నీతోనే నేను మా అమ్మ‌కు ఇవ్వ‌న్నీ చేయించ‌గలిగాను. నా లాంటి ఎంతోమంది కమెడియన్లు జబర్దస్త్ కు వచ్చాకే కడుపునిండా తినగలుగుతున్నామని, ఇళ్లు, కార్లు కొనుక్కున్నామని తెలిపాడు. జ‌బ‌ర్ధ‌స్త్‌కు నేనెప్పుడు రుణప‌డి ఉంటాన‌ని కార్తీక్ అన్నాడు. అయితే త‌న త‌ల్లికి సంబంధించిన విష‌యాలు చెబుతున్న స‌మ‌యంలో సుమ‌, యాంక‌ర్ ర‌వి భావోద్వేగానికి గుర‌య్యారు. క‌న్నీటిప‌ర్యంత‌మ‌య్యారు.

- Advertisement -

Related Posts

కరోనా ఎఫెక్ట్: ఈ ఏడాదైనా ఎన్టీవీ ‘కోటి దీపోత్సవం’ జరిగేనా..?

ప్రముఖ వార్తా చానెల్ ఎన్టీవీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా కార్తీకమాసంలో కోటి దీపోత్సవం కార్యక్రమం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రత్యక్షంగా వేలమంది భక్తులు పాల్గొనే ఈ కార్యక్రమాన్ని సంస్థకే చెందిన భక్తి చానెల్...

ఐటీ పాలసీ, EMC, డిజిటల్ లైబ్రెరీలపై సీఎం జగన్ సమీక్ష…పలు కీలక నిర్ణయాలు !

తాడేపల్లి: ఎపీ సీఎం క్యాంప్ ఆఫీస్‌లో ఐటీ పాలసీ, ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్స్(EMC) ,గ్రామాల్లో డిజిటల్ లైబ్రెరీల ఏర్పాటుపైన అధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. ఈ...

ఇప్పటిదాకా ఆసుపత్రుల దోపిడీ, ఇకపై విద్యా సంస్థల దోపిడీ.

కరోనా సెకెండ్ వేవ్ నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రులు అడ్డగోలుగా దోచేశాయ్. ఇప్పుడు ప్రైవేటు విద్యా సంస్థల వంతు వచ్చినట్టుంది. దోపిడీ షురూ అయ్యింది. వేలల్లో లక్షల్లో ఫీజుల్ని గుంజేస్తున్నాయి ప్రైవేటు విద్యా సంస్థలు....

Latest News