అవునండీ మీరు వింటున్నది నిజమే. ‘పుష్ప 2’ సినిమాకి మరింత హైప్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయ్. అందులో భాగంగానే సాయి పల్లవిని ఈ సినిమాలో భాగం చేయాలనుకుంటున్నాడట డైరెక్టర్ సుకుమార్.
తొలుత ఇది ఉత్త గాసిప్ మాత్రమే అన్నారు. కానీ, సాయి పల్లవి కోసం ఓ రోల్ స్పెషల్‌గా దర్శకుడు సుకుమార్ డిజైన్ చేస్తున్నాడట. లేడీ పవర్ స్టార్ అనే ఇమేజ్ సాయి పల్లవికి వుంది.
అది మలయాళంలోనూ, తమిళంలోనూ, తెలుగులోనూ మరింతగా పుష్పకి కలిసొస్తుందని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే.. ఆమె కోసం స్పెషల్ ట్రాక్ రాశారట సినిమాలో. అది సినిమాకి ఖచ్చితంగా కలిసొస్తుందని అంటున్నారు.
ఈ స్పెషల్ రోల్‌లో నటించేందుకు సాయి పల్లవి నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వున్నట్లు ఇన్ సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం. మరి, ఈ గాసిప్‌లో నిజమెంతో చూడాలి. అన్నట్లు ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా రష్మికా మండన్నా నటిస్తున్నసంగతి తెలిసిందే. .