వైరల్ : “బేబీ” ని ఆకాశానికెత్తేసిన సుకుమార్…!

ఈ ఏడాది టాలీవుడ్ సినిమా దగ్గర వచ్చి సెన్సేషనల్ హిట్ గా మారిన లేటెస్ట్ చిత్రాల్లో గత వారం థియేటర్స్ లోకి వచ్చిన చిత్రం “బేబీ” కూడా ఒకటి. మరి ఇది చాలా తక్కువ బజ్ తోనే వచినప్పటికీ ఒక్కసారిగా థియేటర్స్ లో టాక్ వచ్చిన తర్వాత ఈ సినిమా దుమ్ము లేపుతుంది.

మరి అనూహ్యంగా ఈ చిత్రం మొదటి రోజు కన్నా మొదటి సోమవారమే భారీ వసూళ్లు నమోదు చేసి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు ఒక స్టెల్లార్ పెర్ఫామెన్స్ ని అయితే సెట్ చేసింది. ఇక ఒక్క ఆడియెన్స్ అటెన్షన్ ని మాత్రమే కాకుండా సినీ ప్రముఖులు మన్ననలు కూడా ఈ చిత్రం అందుకోవడం విశేషం.

అయితే లేటెస్ట్ గా పాన్ ఇండియా దర్శకుడు మన టాలీవుడ్ లెక్కల మాస్టర్ సుకుమార్ ఈ సినిమాపై ఓ రేంజ్ లో పొగుడుతూ పోస్ట్ చేయడం వైరల్ గా మారింది. అయితే తాను బేబీ సినిమా కోసం చాలానే చెప్పారు. మాటల్లోని చేతల్లోని చెప్పలేని ఒక అద్భుతమైన రచనను నేను చాలా కాలం తర్వాత చూసాను అని ఖచ్చితంగా ఈ సినిమా సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్త వేవ్ ని తీసుకొస్తుంది.

సినిమాలో ప్రతి సీన్ కూడా నాకు మంచి సస్పెన్స్ గా థ్రిల్లింగ్ గా అనిపించాయి అని కుడోస్ టు దర్శకుడు సాయి రాజేష్ అంటూ ఓ రేంజ్ లో సినిమాని ఆ పాత్రలని ఆకాశానికి ఎత్తేసారు సుకుమార్. నిర్మాతలు ఎస్ కె ఎన్, మారుతీల అటెంప్ట్ కూడా మెచ్చుకొని వైష్ణవి చైతన్య పాత్రని తీర్చి దిద్దిన విధానాన్ని కూడా మెచ్చుకున్నారు.

ఆనంద్ కూడా బాగా నటించాడు అని సంగీతం ఇచ్చిన విజయ్ బుల్గానిన్ బాల్రెడ్డి సినిమాటోగ్రఫీ లు అదిరిపోయాయి అని సుకుమార్ చాలా పెద్ద పోస్ట్ పెట్టి చిత్ర యూనిట్ కి బిగ్ బూస్టప్ ని ఇచ్చారు. ఇది మాత్రం చిత్ర యూనిట్ కి బాగా ప్లస్ అవుతుంది అని చెప్పాలి.