Sukumar: ఆ హీరోను పక్కన పెడుతున్న లెక్కల మాస్టర్… ఏదో లెక్క తప్పినట్టుందే!

Sukumar: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా అంటే అభిమానులకు కూడా ఓ లెక్క ఉంటుంది. ఆయన సినిమాలు ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా ఉంటాయి. ఈ క్రమంలోనే పుష్పసినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుకుమార్ ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమాని ఈ నెల చివరికి సెట్స్ పైకి తీసుకెళ్లాలని ఆలోచనలో ఉన్నారు.

ఇకపోతే సుకుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సినిమా ఉంటుందని గత కొద్ది రోజుల క్రితం వరకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.అయితే ప్రస్తుతం వీరిద్దరి సినిమా గురించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో లెక్కల మాస్టర్ హీరోని పక్కన పెట్టేశారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.వీరిద్దరి కాంబినేషన్లో పాన్ ఇండియా స్థాయిలో సినిమా ఉంటుంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చినప్పటికీ ఈ సినిమాకి సంబంధించిన సమాచారం వెల్లడించకపోవడంతో పలు సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.

ఇక సుకుమార్ ప్రస్తుతం పుష్ప పార్ట్-2 పనులతో బిజీగా ఉండగా, విజయ్ దేవరకొండ మాత్రం లైగర్ సినిమాతో ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా క్యాన్సిల్ అయ్యిన్నట్లు తెలుస్తుంది. ఇన్నాళ్లు ఈ సినిమా కోసం ఎదురు చూసిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ సినిమా పూర్తి చేసుకోవడంతో కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. పుష్ప పార్ట్ 2 పూర్తయిన తర్వాతే ఇతర సినిమాల గురించి ఆలోచిస్తానని సుకుమార్ చెప్పడంతో విజయ్ దేవరకొండ కూడా తన సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం.