పుష్ప 2 కోసం టాలీవుడ్ స్టార్ హీరో ని దింపుతున్న సుకుమార్

తన కెరీర్ లో ఎన్ని హిట్స్ ఉన్నప్పటికీ అల్లు అర్జున్ కి ‘పుష్ప’ సినిమాతో వచ్చినంత క్రేజ్ ఏ సినిమాకు రాలేదు. మళళయాళం సినిమా ఇండస్ట్రీ లో స్టార్ ఇమేజ్ ఉన్న అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాతో ఒక్కసారి పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు.

ఆ సినిమా హిట్ అవ్వడంతో ఇప్పుడు సీక్వెల్ మీద చాలా నమ్మకాలు ఉన్నాయి. డైరెక్టర్ సుకుమార్ ‘పుష్ప 2 ‘ సినిమాను మరింత హైప్ వచ్చేలా చేస్తున్నాడు. మొదటి పార్ట్ లో సునీల్, అనసూయ తో పాటు ఫహద్ ఫాసిల్ క్లైమాక్స్ లో ఇంపార్టెంట్ రోల్ లో కనిపించాడు. అయితే సెకండ్ పార్ట్ లో ఫహద్ రోల్ ఎక్కువ ఉంటుందని తెలుస్తుంది, అలాగే ఫహద్ పై ఆఫీసర్ రోల్ లో విజయ్ సేతుపతి కనిపిస్తాడని కూడా ఒక వార్త వచ్చింది.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఒక పవర్ఫుల్ పొలిటిషన్ గా ఈ సినిమాలో హీరో గోపీచంద్ ని తీసుకునేందుకు సుకుమార్ ప్రయత్నిస్తున్నాడని తెలుస్తుంది. గోపీచంద్ తో ఈ సినిమాకు మరింత క్రేజ్ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే దీనిపై మూవీ టీం కానీ, గోపీచంద్ కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇంతకముందు ‘జయం’, ‘నిజం’, ‘వర్షం’ లాంటి సినిమాల్లో పవర్ఫుల్ విలన్ గా నటించి మెప్పించాడు. ఈ సినిమా లో మళ్ళీ అలాంటి రోల్ చేస్తే తప్పకుండా ఈ మూవీ కి క్రేజ్ వస్తుంది.