దుల్కర్ తదుపరి తెలుగు సినిమా కోసం రంగంలోకి దిగిన సుకుమార్ … మరి పుష్ప సంగతి ఏంటి?

క్ష‌మించ‌మంటున్న దుల్క‌ర్‌!

మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఈయన మహానటి సినిమాలో జెమినీ గణేషన్ పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. అయితే తాజాగా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో సందడి చేశారు. ఈ క్రమంలోని ఈయనకు తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ కు తెలుగులో అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. సీతారామం సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయనకు తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయి.

దుల్కర్ సల్మాన్ సైతం తెలుగు సినిమాలలో నటించడానికి ఎంతో ఆసక్తి కనపరచడంతో ప్రస్తుతం టాలీవుడ్ దర్శకుల చూపు మొత్తం దుల్కర్ సల్మాన్ పై పడింది.అయితే దుల్కర్ కోసం ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారిలో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ముందు వరుసలో ఉన్నారు.ఈయన దగ్గర ఎంతోమంది శిష్యరికం పొంది ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకులుగా పేరు ప్రఖ్యాతలు పొందారు. ఈ క్రమంలోనే తన శిష్యుల కోసం సుకుమార్ రంగంలోకి దిగినట్టు సమాచారం.

ఇప్పటికే ఇండస్ట్రీలో కుమారి 21ఎఫ్,ఉప్పెన వంటి సినిమాల ద్వారా సుకుమార్ దర్శకులు డైరెక్టర్లుగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే తన శిష్యులలో ఎవరు సరైన కథతో ముందుకు వస్తే సుకుమార్ ఆ కథను దుల్కర్ సల్మాన్ కు వినిపించి మైత్రి మూవీ మేకర్ నిర్మాణంలో తన శిష్యుల దర్శకత్వంలో ఆ సినిమాని చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. మరి దుల్కర్ సల్మాన్ తన తదుపరి తెలుగు సినిమా అవకాశాన్ని సుకుమార్ శిష్యులకు ఇస్తారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.