“పుష్ప 2” కి సుకుమార్ భారీ ప్లానింగ్స్..విజువల్స్ వైరల్..!

ఇప్పుడు నో డౌట్ గా పాన్ ఇండియా  మార్కెట్ లో సెన్సేషనల్ హైప్ ఉన్నటువంటి చిత్రాల్లో పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒకడు. మరి తన సొంత బ్రాండ్ తో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకోవడమే కాకుండా టాలీవుడ్ నుంచి మొట్ట మొదటి నేషనల్ అవార్డు విన్ అయ్యిన ఏకైక హీరోగా కూడా చరిత్రలో నిలిచాడు.

కాగా తనకి సెన్సేషనల్ హిట్ “పుష్ప” కి గాను అవార్డు రాగ ఈ అవార్డు తర్వాత అయితే పుష్ప 2 పై ఎనలేని అంచనాలు నెలకొన్నాయి. దీనితో ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ కూడా అదే హైప్ లో తెరకెక్కుతూ ఉండగా ఈ సినిమాలో సుకుమార్ అయితే నెవర్ బిఫోర్ విజువల్స్ చూపించడం ఖాయం అని మరోసారి రుజువయ్యింది.

కాగా పుష్ప 2 ని చాలా బెటర్ గా చాలా గ్రాండ్ విజువల్స్ తో ప్లాన్ చేస్తున్నామని చెప్పిన మేకర్స్ చెప్పిన మాట ప్రకారమే సెన్సేషనల్ విజువల్స్ ని చూపించారు. లేటెస్ట్ గా పుష్ప 2 సెట్స్ నుంచి కొన్ని విజువల్స్ వైరల్ గా మారాయి. లొకేషన్ లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వందల సంఖ్యలో లారీలతో నింపేశారు.

దీనితో ఇది సాంగ్ కోసమా లేక ఏదన్నా ఏక్షన్ బ్లాక్ కోసమా అనేది మాత్రం ఆశ్చర్యంగా మారింది. దీనితో పుష్ప 2 మాత్రం సుకుమార్ భారీ లెవెల్లో ఊహించని విధంగా ప్రెజెంట్ చేస్తున్నారని చెప్పాలి. కాగా ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా ఈసారి సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.