అమ్మకు ప్రేమతో.. ఎంతైనా సుకుమార్ బిడ్డ కదా!!

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్ సినిమాలు అందరికీ అర్థం కావు. అది మనసు, బుర్ర పెట్టి ఆలోచించాలి. ఎందుకో ఆయన ఓ లెక్కల మాస్టర్. ఆయన తెరకెక్కించే సినిమాలు కూడా ఆ స్థాయిలోనే ఉంటాయి. చేసే ప్రతీ సినిమా కూడా ప్రత్యేకంగా ఉండాలి.. భిన్నంగా ఉండాలని పరితపిస్తుంటాడు. అందుకే ఆయన నుంచి ఆర్య, వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో, రంగస్థలం వంటి ఎన్నో అద్భుత చిత్రాలు వచ్చాయి.

Sukumar Daughter Sukrithi Birthday Wishes To Thabitha Sukumar
Sukumar Daughter Sukrithi Birthday Wishes To Thabitha Sukumar

సుకుమార్ సినిమాలోని లాజిక్స్ అందుకోవడం అంత సులభమైనది కాదు. ఎలాంటి ఎమోషన్స్ అయినా సరే ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా మలచగలడు. ఇక సుకుమార్‌కు తన నాన్న అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. దానికి నిదర్శనంగా నాన్నకు ప్రేమతో అనే చిత్రం వచ్చిందా? అనే అనుమానం కూడా వస్తుంది. అలాంటి సుకుమార్ కూతురు సుకృతి ఇంకెలా ఉంటుందో చెప్పంది.

Sukumar Daughter Sukrithi Birthday Wishes To Thabitha Sukumar
Sukumar Daughter Sukrithi Birthday Wishes To Thabitha Sukumar

లెక్కల మాష్టారు కూతరు సుకృతి వాళ్ల అమ్మ తబితా సుకుమార్‌పై ప్రేమను కురిపించింది. నేడు తబితా పుట్టిన రోజు. ఈ సందర్భంగా తబితా (Thabitha)కు నిర్వచనం రాసింది. ట్యూ క్యూట్, హంబుల్, అమేజింగ్, బ్యూటీఫుల్, ఇంప్రెసివ్, టూ అమేజింగ్, హ్యూమరస్, అమేజింగ్ అంటూ వర్ణించింది. ఇక మామ్ అంటే మార్వలెస్ ఔట్‌స్టాండింగ్ మదర్ అంటూ అమ్మకపై ప్రేమను కురిపించింది. ఇప్పుడే ఇలా ఉందంటే పెద్దయ్యాక సుకుమార్ మించే రైటర్ అవుతుందేమో చూడాలి.