మాట మార్చేసిన సుకుమార్.. అడ్వాన్స్‌గానే అన్ని కోట్లా?

Sukumar Advance Remuneration For Vijay Devarakonda Movie

టాలీవుడ్‌లో దర్శకుడిగా సుకుమార్‌కు ఉన్న పేరు, ఫేమ్ ప్రత్యేకం. ప్రేక్షకుడి స్థాయిని పెంచే చిత్రాలను తెరకెక్కిస్తుంటాడు. మూసధోరణిలో వెళ్లి సినిమాలను తీయడం సుకుమార్ శైలి కానే కాదు. ఏదైనా సరే పాత్ బ్రేకింగ్‌గా ఉంటుంది. కొత్త కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులను మెప్పించడమే సుకుమార్‌కు తెలుసు. అందుకే అప్పటి వరకు లేనీ ఫీల్ మై లవ్ అనే వినూత్న కాన్సెప్ట్‌తో ఆర్య సినిమా తీశాడు.

Sukumar Advance Remuneration For Vijay Devarakonda Movie
Sukumar Advance Remuneration For Vijay Devarakonda Movie

మొదటి సినిమానే అయినా కొత్త ప్రయోగాన్ని చేసి సక్సెస్ అయ్యాడు. ఫ్లాపులు వచ్చినా సక్సెస్ కొట్టినా సరే తన పంథాను మార్చుకోడు. అయితే ఈ లెక్కల మాస్టరుకు ఓ పద్దతి ఉంది. తాను ఏ సినిమాలకు అడ్వాన్స్ తీసుకోడు. ఇదే విషయాన్ని గతంలో ఎన్నో సార్లు చెప్పాడు కూడా. అడ్వాన్స్ తీసుకుంటే అదో భయం ఉంటుంది.. చేసే పనికి న్యాయం చేయలేనని, అందుకే తాను అడ్వాన్స్‌లు ఎవ్వరి దగ్గరి నుంచి తీసుకోనని తెలిపాడు.

అయితే తాజాగా 2022లో విజయ్ దేవరకొండతో చేయబోతోన్న సినిమాకు సుకుమార్ అడ్వాన్స్ తీసుకున్నాడని, అది కూడా పది కోట్ల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. కేవలం అడ్వాన్స్‌గానే ఇంత ముట్టిందంటే.. టోటల్ రెమ్యూనరేషన్ ఇంకే రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు. అయితే ఇంత మొత్తంలో డబ్బు ఇస్తానని అనడంతోనే టెంప్ట్ అయి ఉంటాడని తెలుస్తోంది. మరి ఇందులో అసలు నిజమెంతో సుకుమార్‌కే తెలియాలి.