సుకుమార్ ఏది చెప్పినా, ఏ సినిమా చూపించినా అందులో లాజిక్కులుంటాయి. ఎవ్వరికీ చిక్కని, అందని ఫార్మూలాలు ఎన్నో ఉంటాయి. ఎంతైనా లెక్కల మాష్టర్ లెక్కల మాష్టారే అవుతాడు. కరెక్ట్‌గా లెక్క చూసుకుని మాట్లాడుతాడు. అయితే ఈయన చెప్పే పాఠాల్లో అప్పుడప్పుడు కెమిస్ట్రీ, ఫిజిక్స్, హిస్టరీ వంటివి కూడా కనిపిస్తుంటాయి. ఎంత లెక్కలు చెప్పే పంతులైనా సరే కెమిస్ట్రీ విషయం, ఆడ మగ మధ్య ఉండే ప్రేమ, కోపతాపాలను సరిపాళ్లలో చూపించగలడు.
అందుకే సుకుమార్ తెరకెక్కించే ప్రేమ కథ చిత్రాలకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. లవ్ స్టోరీ చిత్రాల్లో సుకుమార్‌ది సపరేట్ ట్రెండ్. అలా సుకుమార్ ఇప్పుడు ఓ షోలో కనిపించాడు. మామూలుగా బుల్లితెరపై సుకుమార్ అంతగా కనిపించడు. అతనికి ఉన్న బిజీ షెడ్యూల్‌లో ఓ బుల్లితెర షో కోసం రావడం అంటే మామూలు విషయం కాదు. స్టార్ మాలో 100 పర్సెంట్ లవ్ అంటూ రాబోతోన్న షోకి సుకుమార్ గెస్ట్ గా వచ్చాడు. అంతే కాకుండా అది ఆయన తెరకెక్కించిన సినిమా టైటిల్ కావడం విశేషం.
100 పర్సెంట్ లవ్ సినిమాలో ఎవ్వరికీ తెలియని ఇన్‌ఫ్యాచ్యువేషన్ అనే కొత్త ఫీలింగ్‌ను పరిచయం చేశాడు. అదే విధంగా ఈ షోలో మాట్లాడుతూ.. ఆడ మగ మధ్య ఉండే అట్రాక్షన్ అద్భుతమంటూ చెప్పుకొచ్చాడు. ఈ ప్రకృతి జనించడానికే కారణం అది కాబట్టి.. అదెప్పుడూ అలా ఉంటూనే ఉంటుందని చెప్పుకొచ్చాడు. లెక్కల మాష్టర్ అని చెప్పుకున్నా కూడా సుకుమార్‌కు అన్ని సబ్జెక్ట్‌ల మీద మంచి పట్టున్న సంగతి ఇలా తెలిసిపోతోంది.