సాహో మూవీతో పాన్ ఇండియా దర్శకుడిగా తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకున్న టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ సుజిత్. ఈ సినిమా తెలుగులో ఎవరేజ్ టాక్ తెచ్చుకున్న హిందీలో హిట్ అయ్యింది. అలాగే ఏకంగా 400 కోట్ల వరకు సాహో సినిమా కలెక్ట్ చేసింది. సాహో సినిమాలో యాక్షన్ సీక్వెన్స్, కంటెంట్ నేరేషన్ విషయంలో విషయంలో దర్శకుడిగా సుజిత్ కి వందకి వంద మార్కులు వేయొచ్చు.
కాని రైటర్ గా మాత్రం సాహో సినిమాకి ఫెయిల్ అయ్యాడు. రొటీన్ కథని తీసుకొని దానిని గ్రాండ్ స్కేల్ పై ఆవిష్కరించాడు అనే విమర్శలు వినిపించాయి. ఇదిలా ఉంటే సాహో తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న సుజిత్ ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తన మూడో సినిమా చేసే అవకాశం సొంతం చేసుకున్నాడు. గ్యాంగ్ స్టార్ కథాంశంతో పాన్ ఇండియా రేంజ్ లోనే ఈ సినిమాని తెరకెక్కించబోతున్నాడు.
ఇక ఈ మూవీ షూటింగ్ మే నుంచి ప్రారంభం కాబోతుంది. ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా మూవీని నిర్మించిన డీవీవీ దానయ్య ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉండటం విశేషం. ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కుతూ ఉంది. ఇదిలా ఉంటే ఈ మూవీ కోసం ప్రస్తుతం లోకేషన్స్ ని అన్వేషించే పనిలో సుజిత్ ఉన్నాడు.
ఇక సుజిత్ ఓజీ కంప్లీట్ చేసిన తర్వాత కేజీఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా ప్రొడ్యూసర్స్ గా మారిపోయిన విజయ్ కిరంగదూర్ నిర్మాణంలో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ లో సినిమా చేయడానికి కమిట్ అయినట్లు తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబందించిన అగ్రిమెంట్ కూడా జరిగినట్లు టాక్ వినిపిస్తుంది. అయితే ఈ మూవీ ఎవరితో చేస్తాడు అనేది విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. హోంబలే ఫిలిమ్స్ ప్రస్తుతం కాంతారా 2 మూవీతో పాటు తెలుగులో సలార్ సినిమాని నిర్మిస్తుంది.
దీంతో పాటు కన్నడ భాషలో మరికొన్ని ప్రాజెక్ట్స్ ని కూడా నిర్మిస్తుంది. ఇవన్ని కూడా యూనివర్శల్ అప్పీల్ ఉన్న పాన్ ఇండియా కథలే కావడం విశేషం. ఇక మూడేళ్ళలో మూడు వేల కోట్ల పెట్టుబడులు సినిమాల మీద పెట్టడానికి హోంబలే ఫిలిమ్స్ ప్లాన్ చేసుకుంది. దానికి తగ్గట్లుగానే సౌత్ లో టాలెంటెడ్ డైరెక్టర్స్ ని లైన్ లో పెడుతున్నట్లు తెలుస్తుంది.